మధుర రాగమొక్కటి -
పుష్ప మధుపరాగ రాశిలో -
తారాడుచు, తొణుకాడుచూ,
యమునా దరిని చేరేనులే!
నీలి జల ఝరిని చేరేనులే! ; ||
వ్యవహారం ఏదేదో ఉన్నాది -
అనుచు - అనుకొనుచు -
పది దిక్కులకునూ తగని ఉత్కంఠ ; ||
కళాకేళి కడు ముచ్చట -
ఇక్కడ ఎవరుంటారని -
వేరెవ్వరు ఉంటారని -
నవ్వింది పవనము ;
పూలజల్లు పుప్పొడుల బొమ్మలన్ని -
క్రిష్ణరాధ ప్రణయ జంట చిత్రణలే,
ప్రకృతి చిత్ర చిత్ర చిత్ర చిత్రలేఖనములన్ని
సుందరమే! బహు సుందరమే!
తీరెను కద - దిక్కులకు ఉత్కంఠ ;
ఇక రచించు, ఆమని ఋతు హాస, లాసముల ముచ్చట ;
దిక్కులకులింక విరచించును,
ఆమని నుడువుల ముచ్చట ; ||
======================= ,
aamani muccaTa - 175 ;-
rAdhikA! rAdhikA!
madhura raagamokkaTi -
pushpa madhuparaaga rASilO -
taarADucu, toNukADucuu,
yamunaa darini cErEnulE!
neeli jala jharini cErEnulE! ; ||
wyawahaaram EdEdO unnaadi -
anucu - anukonucu -
padi dikkulakunuu tagani utkamTha ; ||
kaLAkELi kaDu muccaTa -
ikkaDa ewarumTArani -
wErewwaru umTArani -
nawwimdi pawanamu ;
puulajallu puppoDula bommalanni -
krishNaraadha praNaya jamTa citraNalE,
prakRti citra citra citra citralEKanamulanni
sumdaramE! bahu sumdaramE!
teerenu kada - dikkulaku utkamTha ;
ika racimcu, aamani Rtu haasa, laasamula muccaTa ;
dikkulakulimka wiracimcunu,
aamani nuDuwula muccaTa ; ||
& శ్రీకృష్ణ లీలలు - గానసుధలు -175 = & శోభకృత్ రాధాకృష్ణ గీతాలు ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి