మా ఊరి ప్రజనులంత మేలుకున్నారు ;
పనిపాటలకు వేళ ఆయెననుకొంటూ ;
త్వరత్వరగ ముందుకు కదులుచున్నారు ; ||
తొలిపొద్దు భాస్కరుడ! ఓలేలొ, ఓలేలొ ;
ఏలనోయీ, ఇంత అశ్వధాటి నీకు!?,
మిడి మిడి ఎండలను పొడమనీయకుమోయి,
చండ్ర నిప్పుల వేడి పొడమనీకోయీ ;
రాధమ్మ తోటి, లలనలు వెడలుచున్నారు ;
గుగ్గిళ్ళు గ్రాసము - తేజీలకోయీ,
నీ రధము ఏడు అశ్వాలకేనోయి ;
కళ్ళాలు బిగబట్టి - దౌడు తగ్గించుము ;
ఎండ పొద్దును చలి వెన్నెలగ చేయవోయ్ ; ||
సప్తవర్ణాలను వెదజల్లుతూ నేడు -
మా వ్రేపల్లె క్రిష్ణయ్య శిఖి పింఛ కాంతులు -
చలచల్లని కాంతులను -
నీ ధాటి పయిన వెదజల్లునోయీ ; ||
======================== .
maa uuri prajanulamta mElukunnaaru ;
panipATalaku wELa aayenanukomTU ;
twaratwaraga mumduku kadulucunnaaru ; ||
tolipoddu BAskaruDa! OlElo, OlElo ;
ElanOyI, imta aSwadhATi nIku!?,
miDi miDi emDalanu poDamaneeyakumOyi,
camDra nippula wEDi poDamaniikOyI ;
raadhamma tOTi, lalanalu weDalucunnAru ;
guggiLLu graasamu - tEjIlakOyI,
nee radhamu EDu aSwaalakEnOyi ;
kaLLaalu bigabaTTi - dauDu taggimcumu ;
emDa poddunu cali wennelaga cEyawOy ; ||
saptawarNAlanu wedajallutuu nEDu -
maa wrEpalle krishNayya SiKi pimCa kaamtulu -
calacallani kaamtulanu -
nee dhATi payina wedajallunOyI ; ||
&
part - 2 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి