కళకళలాడుచు కులుకుచున్నవి -
క్రిష్ణుని వేణువులో
శ్రీక్రిష్ణుని వేణురవళిలో ; ||
నిన్నటిదాకా ...
ఏదో మూలన ముడుచుకుకూర్చుని ఉన్నాయి ;
ముడుచుకునున్నవి ఈ గీతములు ...
క్రిష్ణుని పల్లవాళులు -
వెదురు గొట్టమున నాట్యమాడినవి ;
చివురువేళ్ళు -నర్తన చేసీ చేయంగానే-
నిలువెల్లా సంగీతమైనవి ;
ఈ పాటలు సంగీతమైనవి ; ||
పణమో పండో మురళీధరునికి -
ఇస్తామంటూ - ఒట్టు పెట్టుకుని ;
కదిలాడుచున్నవి గీత మాలికలు ;
ఇంపగు నవీన రాగమ్ములకు -
శ్రీకారమ్ములు చుట్టుచున్నవి - ||
======================= ,
pATala kulukulu cUDaMDI,;-
kaLakaLalaaDucu kulukucunnawi -
krishNuni wENuwulO
SreekrishNuni wENurawaLilO ; ||
ninnaTidAkaa ...
EdO mUlana muDucukukuurcuni unnaayi ;
muDucukununnawi ee geetamulu ...
krishNuni pallawALulu -
weduru goTTamuna naaTyamADinawi ;
ciwuruwELLu -nartana cEsI cEyaMgAnE-
niluwellaa samgeetamainawi ;
ee pATalu samgeetamainawi ; ||
paNamO paMDO muraLIdharuniki -
istAmamTU - oTTu peTTukuni ;
kadilaaDucunnawi geeta maalikalu ;
impagu naweena raagammulaku -
Sreekaarammulu cuTTucunnawi ; ||
& శ్రీకృష్ణ లీలలు - గానసుధలు -172 = & శోభకృత్ రాధాకృష్ణ గీతాలు ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి