3, ఫిబ్రవరి 2024, శనివారం

అష్ట దిక్కుల లేఖలు-167

"అష్ట దిక్కుల లేఖలు" రాసెను ;

కన్నుల కరిగే కాటుకతో,

తన కన్నీట ఉరలెడు కజ్జలమ్ముతో -

క్రిష్ణ ప్రేమిక, బేల రాధిక ; ||

నీలమోహనుడు వంశీ కృష్ణుడు

పడతి రాధిక ఎదురుతెన్నుల -

యవనిక పయిన శాశ్వత చిత్రము -

విచిత్ర మాయగ - ముద్రణ ఆయెను ;

వేగమె తాను రాకుంటే -

దిక్కులు సైతము కోపగించును ;

"క్రిష్ణుడు చాలా దుడుకు వాడు" అని ; ||

రాధిక లేఖ రమణీయం ;

కొత్త కావ్యముల - శ్రీసూక్తము అది ; ||

======================== ,

pATa - 1 ;- Letters on 8 directions-pages ;- 

"ashTa dikkula lEKalu" raasenu -

kannula karigE kaaTukatO,

tana kanneeTa uraleDu kajjalammutO -

krishNa prEmika, bEla raadhika ; ||

neelamOhanuDu wamSI kRshNuDu

paDati raadhika edurutennula -

yawanika payina SASwata citramu -

wicitra maayaga - mudraNa aayenu ;

wEgame taanu raakumTE -

dikkulu saitamu kOpagimcunu ;

"krishNuDu cAlA duDuku wADu" ani ; ||

raadhika lEKa ramaNIyam ;

kotta kaawyamula - Sreesuuktamu adi ; || 

& &

part - పార్ట్ ;- 2 ; శ్రీకృష్ణ లీలలు - గానసుధలు -167 &  శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2024 ; పాట - 1 ;-  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి