అమవస్య ఫలకముపయి -
కోటి రంగవల్లికలు ;
రాధమ్మ - క్రీగంటి చూపుల -
శతకోటి ముగ్గులే ముగ్గులు ; ||
నది ఒడ్డున ఇసుకలపయి
రాసక్రీడ ఆటలు -
సైకతములు ఎగయు ధూళిరేణువులు -
గాలి పైన వేస్తు ఉన్నట్టి -
వింత వింత బొమ్మలు ; ||
వెన్నెలమ్మ దస్తూరీ -
ఈ తూరి చిత్రించు కొత్త చిత్రములు ;
రాధా, నీ చూపులు -
ఇన్నిటినీ, ఇందరినీ -
సర్వ చిత్ర కళలలోన -
నిష్ణాతులను చేస్తూన్నవి, చిత్రమే!
బహు చిత్రమే ; ||
=========================== ,
amawasya phalakamupayi -
kOTi ramgawallikalu ;
raadhamma - kreegamTi cuupula -
SatakOTi muggulE muggulu ; ||
nadi oDDuna isukalapayi
raasakrIDa ATalu -
saikatamulu egayu dhULirENuwulu -
gaali paina wEstu unnaTTi -
wimta wimta bommalu ; ||
wennelamma dastuuree -
ee tuuri citrimcu kotta citramulu ;
raadhaa, nee cuupulu -
inniTinee, imdarinee -
sarVa citra kaLalalOna -
nishNAtulanu cEstuunnawi, citramE!
bahu citramE ; ||
& చిత్రమే! బహు చిత్రమే - 155 ; &
శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2024 ; God krishna song- 155 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి