4, ఫిబ్రవరి 2024, ఆదివారం

వసంత హేల - 181

వ్రేపల్లెలొ వసంతముల ఆట సాగుచున్నది ;

అనంతముల దాకా - 

మృదు వసంతాల హేలలులే ; ||

జానపదులు గుమిగూడిరి ;

దధి భాండం క్రీడలకు -

కొత్త ఊపు వచ్చినది ; ||

రేపల్లెలోన ప్రతి అడుగు నాట్యమాయె -

రేపల్లియ ప్రతి పదమూ - పాట ఆయె ;

పల్లీయుల మోదములలొ -

మేదిని హృది పుష్పాంజలి ;

ఉట్టికుండ ఆటలు మొదలైనవి -

ఏడీ మన కృష్ణుడు?,

ఏదీ, ఎచట - మా రాధిక?

అదిగదిగో - వచ్చేరు,

ఇక గడియ గడియకూ -

చైతన్య హేల, సంబరములు ; ||

========================== ,

wrEpallelo wasamtamula ATa sAgucunnadi ;

anamtamula daakaa - mRdu wasamtaala hElalulE ; ||

jaanapadulu gumigUDiri ;

dadhi BAmDam krIDalaku -

kotta uupu waccinadi ; ||

rEpallelOna prati aDugu nATyamAye -

rEpalliya prati padamuu - pATa aaye ;

palleeyula mOdamulalo -

mEdini hRdi pushpaamjali ;

uTTikumDa ATalu modalainawi -

EDI mana kRshNuDu?,

Edee, ecaTa - maa rAdhika?

adigadigO - waccEru,

ika gaDiya gaDiyakuu -

caitanya hEla, sambaramulu ; ||

&     &    శ్రీకృష్ణ లీలలు - గానసుధలు -181  శోభకృత్ రాధాకృష్ణ గీతాలు  ;  

radha krishna - 180 start 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి