3, ఫిబ్రవరి 2024, శనివారం

పాటల కులుకులు - 168

కమ కమ్మని పాటను

స్వరము అల్లుకున్నది ;

స్వరవల్లరి కౌగిలిలో ;

పాట కులుకుచున్నది -

మురళి పాట కులుకుచున్నది ; ||

ప్రియదేవీ! రాధికా!

నీ, ముంగురులు గురువులు ;

రిమ్మ ఝిమ్మ ఝిమ్ -

గమకముల గమ్మత్తుకు ;

మదనకేళి తూగులకు -

ముంగురులు భలే గురువులు ; ||

పగడాల అధరముల -

వంపుసొంపు హరివిల్లులు ;

ఇక్షుధన్వి - మన్మధుని -

చేతి విలుకు అచ్చెరువుల కానుకలు ;

దొరికె "దొర"కు కానుకలు ; ||

===================== ,

pATala kulukulu - 168 ;- 

kama kammani pATanu

swaramu allukunnadi ;

swarawallari kaugililO ;

pATa kulukucunnadi -

muraLi pATa kulukucunnadi ; ||

priyadEwee! raadhikaa!

nee, mumgurulu guruwulu ;

rimm jhimm jhimm -

gamakamula gammattuku ;

madanakELi tuugulaku -

mumgurulu BalE guruwulu ; ||

pagaDAla adharamula -

wampusompu hariwillulu ;

ikshudhanwi - manmadhuni -

cEti wiluku acceruwula kaanukalu ;

dorike doraku kaanukalu ; ||

& శ్రీకృష్ణ లీలలు - గానసుధలు -168 =   శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2024 ; 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి