వేణుధరుడు, పింఛధారి -
కౌస్తుభమణిధారుడు ;
వీడేనే, అమ్మలాల!
- వీడి సన్నిధానమునిక -
వీడనే వీడము ; ||
పాలకడవలోన -
నిండు జాబిల్లిని సాంతం -
చూపిస్తాడు క్రిష్ణుడు ;
కళలెన్నొ తెలిసినవాడు,
కళల విలువ తెలిసిన వాడు -
వీడే కదటే ఓయమ్మా! ;
- వీడి సన్నిధానమునిక -
వీడనే వీడము ; ||
పాలసంద్ర నివాసి ;
పాలుగారు బుగ్గల -
పాల నవుల తొణుకును ;
ఆబాలగోపాల -
మానస సంచారి ;
- వీడి సన్నిధానమునిక -
వీడనే వీడము ; ||
==================== ,
mAnasasamcAri - 159 ;-
wENudharuDu, pimCadhaari -
kaustubhamaNidhaaruDu ;
wIDEnE, ammalaala!
- wIDi sannidhaanamunika -
wIDanE wIDamu ; ||
paalakaDawalOna
nimDu jaabillini saamtam -
cuupistADu krishNuDu ;
kaLalenno telisinawADu,
kaLala wiluwa telisina wADu -
wIDE kadaTE OyammA! ;
- wIDi sannidhaanamunika -
wIDanE wIDamu ; ||
paalasamdra niwaasi ;
paalugaaru buggala -
paala nawula toNukunu ;
aabaalagOpaala -
maanasa samaacaari ;
- wIDi sannidhaanamunika -
wIDanE wIDamu ; ||
& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2024 ; God krishna song- 159
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి