3, ఫిబ్రవరి 2024, శనివారం

సరళీ స్వర ప్రకృతి - 178

నిఖిల మానవాళి -
మనో ప్రణయ భావ రమ్య -
ప్రతిబింబిత సౌహార్ద్ర బింబ -
ప్రకృతి విరళ సరళి ఈమె ;
||రాధిక - ఇది రాధిక - మన రాధిక ; ||
సారస్వత సమ్మోహిని ;
విస్ఫారిత నీలి నళిని -
ప్రేమార్ధం సాకారిణి -
నిర్వచన క్రమ పదాళి -
రంగేళీ సుస్థాపిత -
||రాధిక - ఇది రాధిక - మన రాధిక||
శ్రీకృష్ణ వేణు గానాంజలి,
పారిజాత సుమదళ ప్రభ -
సౌరభముల శుభవల్లరి ;
మురళిరవళి గమకార్పిత -
మృదు అల్లిక -
||రాధిక - ఇది రాధిక - మన రాధిక ||
=========================== ,
nikhila maanawALi -
manO praNaya BAwa ramya -
pratibimbita sauhaardra bimba -
prakRti wiraLa saraLi eeme ;
||rAdhika - idi rAdhika - mana rAdhika ; ||
saaraswata sammOhini ;
wisphaarita neeli naLini -
prEmaardham saakaariNi -
nirwacana krama padaaLi -
ramgELI susthaapita -
||rAhika - idi rAdhika - mana rAdhika||
SrIkRshNa wENu gAnAmjali,
pArijaata sumadaLa prabha -
sauraBhamula SuBawallari ;
muraLirawaLi gamakaarpita -
mRdu allika -
||rAdhika - idi raadhika - mana rAdhika ||
=======================  ,
  &    శ్రీకృష్ణ లీలలు - గానసుధలు -178  =   శోభకృత్ రాధాకృష్ణ గీతాలు  ; 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి