3, ఫిబ్రవరి 2024, శనివారం

చెంగల్వ మొగ్గలు - 180

బృందావనికే సాధ్యం, ;

ఈ ముద్దూముచ్చటల

సాంప్రదాయ చమత్కృతులు ; ||

విరితోట అవుతున్నది -

క్రిష్ణ మురళి రవళిగా,

రాధాక్రిష్ణ మురళి రవళిగా ; ||

కన్నయ్య మెడలోని -

చెంగల్వల మొగ్గలలో,

విప్పారిన మొగ్గలలో -

ముగ్ధ రాధ లేతసిగ్గు -

మొగ్గలేయుచున్నది ||

ప్రణయ జంటలకు వలువలు ;

పుప్పొడుల జల్లుల -

దుస్తుల బహూకృతులు ; ||

================== ,

bRmdaawanikE saadhyam, ;

ee mudduumuccaTala

saampradaaya camatkRtulu ; ||

wiritOTa awutunnadi -

krishNa muraLi rawaLigA,

raadhaakrishNa muraLi rawaLigA ; ||

kannayya meDalOni -

cemgalwala moggalalO,

wippaarina moggalalO -

mugdha raadha lEtasiggu -

moggalEyucunnadi ||

praNaya jamTalaku waluwalu ;

puppoDula jallula -

dustula bahuukRtulu ; || 

=======================  ,

  &    శ్రీకృష్ణ లీలలు - గానసుధలు -180  =  చెంగల్వ మొగ్గలు  శోభకృత్ రాధాకృష్ణ గీతాలు  ;  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి