3, ఫిబ్రవరి 2024, శనివారం

శ్రీకృష్ణ లీలలు - గానసుధలు - 160

నీవే నీవే నీవేనా,

నా ఎదుట ఉంటివి క్రిష్ణయ్యా!

రెప్ప వేయుట మరిచినట్టి తెలియరాని మైకము ;

"ఇది" అనుచూ వివరమేదో తెలుపలేని పరవశం ;

నా ఈ మమతానురాగ తుషార తప్తము ;

చాలును, చాలును -

నాదు 'మది - మందిర' మైనది ;

నాదు జన్మ ధన్యము ; ||

కోటి ద్యుతుల కాంతిపుంజము -

శరత్ పౌర్ణమి బింబము ;

చల్లనైన చక్కచక్కని -

"వన్నె వెన్నెల- ఉడుపు" -

దాల్చెను ప్రౌఢి పుడమి ; ||

ఇన్ని సుందర్యాల కేంద్రమైనది రాధిక ;

ఇన్నిన్ని వింతలు చోద్యాలను -

నెలకొల్పిన వేల్పు నీవే!

ఈ పుణ్య వసుధను మసలగలుగుట -

భాగ్యమన్న నాదె భాగ్యము ; ||

===================== ,

neewE neewE neewEnaa,

naa eduTa umTiwi krishNayyA!

reppa wEyuTa maricinaTTi -

teliyaraani maikamu ;

"idi" anucuu wiwaramEdO

telupalEni parawaSam ;

naa ee mamataanuraaga

tushaara taptamu ;

caalunu, caalunu -

naadu madi -

mamdiramainadi ;

naadu janma dhanyamu ; ||

kOTi dyutula kaamtipumjamu -

Sarat paurNami bimbamu ;

callanaina cakkacakkani

"wanne wennela- uDupu"

daalcenu prauDhi puDami ; ||

inni sumdaryaala kEmdramainadi raadhika ;

inninni wimtalu cOdyaalanu -

nelakolpina wElpu neewE! 

ee puNya wasudhanu masalagaluguTa -

bhaagyamanna naade bhaagyamu ; || 

srikrishnaleelalu - 160   




 శ్రీకృష్ణ లీలలు - గానసుధలు - + 160 ;   శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2024 ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి