3, ఫిబ్రవరి 2024, శనివారం

జైలు శోభలు - 174

అలి నీలకుంతలుడు, కౌస్తుభమణిధారి,
శ్యామలవర్ణుడు,
చెరసాలలో ప్రభలు నింపినాడమ్మా! ; ||
దేవకి ఒడి నేడు, కనకమణి కోవెల ;
మేదినిని చీకటియు - వెన్నెలే ఆయెను ;
రేపల్లెకు దారి ఎటు వెళ్ళవలెనో,
మింటి నక్షత్రములు,
కనుల మిణుకుల శోభ -
వెదజల్లి చూపేను ; ||
ఉజ్జ్వల శ్రీనీలజలదసదృశుడు ;
సజ్జన దాక్షిణ్య రక్షణవ్రతుడితడు ;
కజ్జలపు నీటిలో - విడు పాయలను జేసి,
పూ-సజ్జలా - జలబాట నేర్పుగా నేర్పరచి -
ముజ్జగముల మెప్పు బడయవమ్మా యమున! ||
గంపలో పాపడు, శ్రీకృష్ణదేవుడు -
వసుదేవునికి ఇంక
ఎందులకు భయము, సందేహము,
యమున ఝరి మెత్తంగ దారి నిచ్చేను;
నిశ్చింత నడకలు - ఆ, తండ్రి వసుదేవునివి ;
ఆశ్చర్యమేముంది, ఇది -
క్రొత్త యుగ కల్పనా కల్పమునకు శ్రీకారము ; ||
======================= ====== ,
jalulO SOBalu - 174 ;-
alineelakumtaluDu, kaustubhamaNidhaari,
SyaamalawarNuDu,
cerasaalalO prabhalu nimpinADammA! ; ||
dEwaki oDi nEDu, kanakamaNi kOwela ;
mEdinini ceekaTiyu - wennelE Ayenu ;
rEpalleku daari eTu weLLawalenO,
mimTi nakshatramulu,
kanula miNukula SOBa -
wedajalli cuupEnu ; ||
ujjwala SrIneelajaladasadRSuDu ;
sajjana daakshiNya rakshaNawratuDitaDu ;
kajjalapu neeTilO - wiDu paayalanu jEsi,
puu-sajjalaa - jalabATa nErpugaa nErparaci -
mujjagamula meppu baDayawammaa yamuna! ||
gampalO pApaDu, SreekRshNadEwuDu -
wasudEwuniki imka
emdulaku bhayamu, samdEhamu,
yamuna jhari mettamga daari niccEnu;
niScimta naDakalu aa - tamDri wasudEwuniwi ;
AScaryamEmumdi, idi -
krotta yuga kalpanaa kalpamunaku Sreekaaramu ; || 
&
జైలు శోభలు - 174 = ఝరి బాట పూల సజ్జ - దారి ;- 174 ;,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి