గారాల పాట, రస రమ్య తేట ;
వాసంత బాట - ఈ స్పర్శ,
ఈ పొలుపు, ముద్దబంతి వంటి రాధమ్మదే ఇట ; ||
ఈ బుల్లి వెదురు ముక్క -
ఏ పూర్వపుణ్యాలు చేసుకున్నదో ఇట ;
దోర నైపుణ్యాల రాగధారలు పొంగు ; ||
రాగమయి రవళియై,
గీత పల్లవియై, పల్లవికి చరణమయి -
సంగీత పల్లకీ అయి -
"గాలి అల్ల్లరి బాల" ఈ వేణువున చేరెను ; ||
క్రిష్ణ పిల్లనగ్రోవి - రాధ చేపట్టేను ;
"చిన్నారి పాట" ఈ పూట తాను -
చిన్న పిల్లగ మారి రాధను చేరేను ;
పడతి "పెదవుల ఒడి" తనకు - పగడాల ఊయల ;
ఉంగ ఉంగా పాట - సాగుతూ ఉన్నది -
సంగీత రాయంచ -
ఆకాశ అవధిలో తారాడున్నాది -
విశ్వము వీణయై మూర్ఛనలు పొంగగా -
శ్రీవాణి వరవీణ తంత్రులను సవరించుకొనుచుండ -
రాధ మురళీ శ్రుతుల - రాగములు తనివొంద -
సగేను మిన్నంటి - నీలిమలు అలముకొని -
నీలిమా వర్ణము ......-
లక్షలాదిగ వన్నియలు అవగా -
కోటి హరివిలులు అంబరము వలువలయె ;
ఈ సరికొత్త వేడుకను
ముక్కోటి దేవతలు మేఘాల వేదికల -
నిలిచి చూస్తున్నారు, మైమరిచి చూస్తున్నారు - ;
భక్తుల మానస సరసీరుహమ్ములు ;
విప్పారుచున్నవి ఆనందహేలల -
ఇన్నిన్ని వింతలు, విడ్డూరములను కని ;
======================== ;
pagaDAla uyyAla - 173 ;-
gArAla pATa, rasa ramya tETa ;
waasamta baaTa - ee sparSa,
ee polupu, muddabamti wamTi raadhammadE iTa ; ||
ee bulli weduru mukka -
E puurwapuNyAlu cEsukunnadO iTa ;
dOra naipuNyaala raagadhaaralu pomgu ; ||
raagamayi rawaLiyai,
geeta pallawiyai, pallawiki caraNamayi -
samgeeta pallakee ayi -
"gaali alllari baala" ee wENuwuna cErenu ; ||
krishNa pillanagrOwi - raadha cEpaTTEnu ;
"cinnaari pATa" ee pUTa taanu -
cinna pillaga maari raadhanu cErEnu ;
paDati "pedawula oDi" tanaku - pagaDAla Uyala ;
umga umgaa pATa - saagutuu unnadi -
samgeeta raayamca -
AkaSa awadhilO taaraaDunnaadi -
wiSwamu weeNayai muurCanalu pomga gaa -
SrIwANi warawINa tamtrulanu sawarimcukonucumDa -
raadha muraLI Srutula - raagamulu taniwomda -
sagEnu minnamTi - neelimalu alamukoni -
neelimaa warNamu ......-
lakshalaadiga wanniyalu awagaa -
kOTi hariwilulu ambaramu waluwalaye ;
ee sarikotta wEDukanu
mukkOTi dEwatalu mEGAla wEdikala -
nilici cUstunnaaru, maimarici cuustunnAru - ;
bhaktula maanasa saraseeruhammulu ;
wippaarucunnawi aanamdahElala -
inninni wimtalu, wiDDUramulanu kani ;======================
& శ్రీకృష్ణ లీలలు - గానసుధలు -172 = & శోభకృత్ రాధాకృష్ణ గీతాలు ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి