దోబూచులాటలు, గోపికలు ఆడేరు ;
వ్రేపల్లెలోని ఆబాలగోపాల -
క్రీడలలొ మేటిదనమిప్పుడు చూడండి ; ||
మునుముందు ఉన్నాడు కన్నయ్య ;
వెనుక నిలిచున్నాది నాట్యాల నెమలి -
రాధమ్మ కేమియూ పాలుపోవుట లేదు ; ||
మల్లెపూపొదలలో నక్కి కూర్చొనె రాధ ;
తన నవ్వు తావుల - మల్లెలు దోగాడుచున్నవి ;
మల్లికలు రాధికకు మంచి స్నేహితులు ;
అవి - ముగ్ధ రాధిక గుట్టు - చక్కగా దాచేను ; ||
క్రిష్ణుని మిత్రూల కూటమి ఇట ఉంది ;
ఆటల మయూరి, తేటవెన్నెల రేడు -
అల చందమామయ్య ;
సైగలు చేయుచూ - నీలాల క్రిష్ణునికి -
ఆచూకి చూపుతున్నాయి ; ||
"ఇందువదన, రాధ! దోబూచులేల!?
నీ ముందు ఇప్పుడే మోకరిల్లుచుంటి,
చంటిబాలుని, నన్ను ఇరుకున పెడుదువా!!?"
మాటల మేటలు వేసేను క్రిష్ణుడు,
గాన వంశీధారి -వాక్ నిపుణ వైభవము -
తెలియనిది ఎవరికని!?
నక్కి నక్కి ఉన్న గోపికలు నవ్వేరు ;
పొంచి దాగున్నట్టి రాధిక -
వెలుపలికి రాకుండ ఎటులుండగలదు!?
============================ ,
dObUculATalu, gOpikalu ADEru ;
wrEpallelOni aabaalagOpaala -
krIDalalo mETidanamippuDu cUDamDi ; ||
munumumdu unnaaDu kannayya ;
wenuka nilicunnaadi nATyaala nemali -
raadhamma kEmiyuu paalupOwuTa lEdu ; ||
mallepuupodalalO nakki kuurcone raadha ;
tana nawwu taawula - mallelu dOgADucunnawi ;
mallikalu raadhikaku mamci snEhitulu ;
awi - mugdha raadhika guTTu - cakkagaa daacEnu ; ||
krishNuni mitruala kUTami iTa umdi ;
ATala mayuuri, tETawennela rEDu - ala camdamaamayya ;
saigalu cEyucU - neelaala krishNuniki aacuuki cUputunnAyi ; ||
"imduwadana, raadha! dObUculEla!?
nee mumdu ippuDE mOkarillucumTi,
camTibaaluni, nannu irukuna peDuduwA!!?"
mATala mETalu wEsEnu krishNuDu,
gaana wamSIdhaari -waak nipuNa waibhawamu teliyanidi ewarikani!?
nakki nakki unna gOpikalu nawwEru ;
pomci daagunnaTTi raadhika - welupaliki raakumDa eTulumDagaladu!?
======================= ;
& శ్రీకృష్ణ లీలలు - గానసుధలు -176 = & శోభకృత్ రాధాకృష్ణ గీతాలు ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి