మధురాపురికి వనితలు కదులుచుండిరి,
కదలాడుచుండిరి ;
కథలు, కబురులు - ముచ్చటాడుతు,
కదలాడుచు ఉండిరి ;
పల్లెల నుండి, వ్రేపల్లియ నుండి -
ఆవుపాలను అమ్మేటందులకు ; ||
కొప్పుల నిండుగ పూలు ముడిచిరి ;
తలపయి మెత్తని కుదురులుంచిరి ;
వారి, కుదురగు నడకలు -
హంసల గురువులు ;
రాయంచల గురువులు, భళి, భళీ ; ||
శిరసుల పయిన క్షీరం గంపలు ;
భుజముల పయిన - జున్ను ముంతలు ;
నడుముల పైన - పాలకడవలు ;
పాలకడలికి ఈసు పుట్టగా ; ||
పెరుగు, మజ్జిగల పాల తుంపురులు ;
తొణుకుల చిందులు - మింటి చుక్కలు ;
ఓలాలో, ఓలేలో, ఓలాలో, ఓలేలో ||
======================= === ;
madhuraanagariki maguwalu ;-
madhuraapuriki wanitalu kadulucumDiri,
kadalaaDucumDiri ;
kathalu, kaburulu - muccaTADutu,
kadalADucu umDiri ;
pallela numDi, wrEpalliya numDi -
aawupaalanu ammETamdulaku ; || ;-
koppula nimDuga puulu muDiciri ;
talapayi mettani kudurulumciri ;
waari, kuduragu naDakalu -
hamsala guruwulu ;
raayamcala guruwulu, BaLi, BaLI ; ||
Sirasula payina ksheeram gampalu ;
bhujamula payina - junnu mumtalu ;
naDumula paina - paalakaDawalu ;
paalakaDaliki eesu puTTagA ; ||
perugu, majjigala paala tumpurulu ;
toNukula cimdulu - mimTi cukkalu ;
OlAlO, OlElO, OlAlO, OlElO ; ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి