మదనదేవుడు వచ్చెను ,
యమున రేవు వద్దకు ;
పత్ని రతి - కోరికను తీర్చగా ; ||
మధురాగిణి, స్వచ్ఛ స్ఫటిక -
ప్రణయమెటుల ఉండుననీ -
రతీదేవి సందేహం -
తీర్చుటకే - మన్మధుడు -
యమున కడకు అరుదెంచెను ; ||
అరుదైనది ఈ దృశ్యం -
అపురూపం ఈ దృశ్యం -
సుతిమెత్తని మల్లియలకు -
సురభిళములు అదనముగా -
సమకూరిన లగ్నమిదియె -
తటిల్లతల సుకుమారం -
రాధ సరళి కారణమ్ము ; ||
========================= ;
madanadEwuDu waccenu ,
yamuna rEwu waddaku ;
patni rati - kOrikanu teercagaa ; ||
madhuraagiNi, swacCa sphaTika
praNayameTula umDunanee -
ratiidEwi samdEham -
teercuTakE manmadhuDu -
yamuna kaDaku arudemcenu ; ||
arudainadi - ee dRSyam -
apuruupam ee dRSyam -
sutimettani malliyalaku -
surabhiLamulu adanamugaa -
samakuurina lagnamidiye -
taTillatala sukumaaram -
raadha saraLi kaaraNammu ; ||**************************************,
& శ్రీకృష్ణ లీలలు - గానసుధలు -179 = & శోభకృత్ రాధాకృష్ణ గీతాలు ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి