3, ఫిబ్రవరి 2024, శనివారం

వానకారు కోయిల - 162

వానకారు కోయిల* -  మన ఇలకు దిగివచ్చెను ;

సవరించుకొనుచు ఉన్నది తన గొంతుకను ;

కన్నయ్య మురళి పాట పల్లవులను, 

చెవుల నింపుకొనుచు మరీ ; ||

వెన్న దొంగ చేతి వాటము ఇది కదా - 

అని కనుగొన్నది అవనితలము ;

అనురక్తి, అందునున్న శుభశక్తి - 

భుక్తి, ముక్తి అభివ్యక్తి, కలగాపులగమ్ముగాను -

ఏదొ వింత, ఏదో వింత, 

అల్లిబిల్లి చికిరిచికిరి గీతల అల్లరులు ;

రాగలహరులీలాగున పరివ్యాప్తి ;

పిచ్చిగీతలనుకుంటే చాలా పొరబాటు సుమా!

పిచ్చిగీతలైననేమి, అందున -

సౌందర్యాల గ్రుమ్మరింపు, గుబాళింపు ;

మన్ను తినే ఈ పిల్లడు - 

ప్రకృతి చెట్టు కొమ్మ పూవు ;

మన అందరి కంటిపాప 'రాధా గోపీ మిత్రుడు' -

పల్లీయుల స్నేహితుడు, హితుడు, 

స్వాగతము, సుస్వాగతము ;

కళావాణి మందహాస స్వాగతము ; ||

=========================== ,

waanakaaru kOyila - mana ilaku digiwaccenu ;

sawarimcukonucu unnadi tana gomtukanu ;

kannayya muraLi pATa pallawulanu - 

cewula nimpukonucu marI ; ||

wenna domga cEti wATamu idi kadA - 

ani kanugonnadi awanitalamu ;

anurakti, amdununna SuBaSakti - 

bhukti, mukti abhiwyakti, kalagaapulagammugaanu -

Edo wimta, EdO wimta, allibilli cikiricikiri gItala allarulu ;

rAgalaharuleelaaguna pariwyaapti ;

piccigeetalanukumTE cAlA porabATu sumA!

piccigeetalainanEmi, amduna -

saumdaryaala grummarimpu, gubALimpu ;

mannu tinE ee pillaDu - prakRti ceTTu komma puuwu ;

mana amdari kamTipaapa - raadhaa gOpee mitruDu -

pallIyula snEhituDu, hituDu, swAgatamu, su swAgatamu ; ;

kaLAwANi mamdahAsa swAgatamu ; 

&
REF notes ;- 1. * English word - కోయిల్ = koil - ఈ మాటకు మూలం - 
తెలుగు మాట - కోయిల/ కోకిల ;
2. पिकं , [Bengali] পিকং, [Gujarati] પિકં, 
[Kannada]  ಪಿಕಂ, [Malayalam] പികം ;;
&

 శ్రీకృష్ణ లీలలు - గానసుధలు -162 ;; వానకారు కోయిల ; 

 శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2024 ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి