3, ఫిబ్రవరి 2024, శనివారం

ఆట పాటల రాధాక్రిష్ణ - 161

ఆటలు అంటే రాధమ్మ - 

         పాటలు అంటే క్రిష్ణయ్య ;

ఆటకు - పాటకు కుదిరిన లంకెను -

వింతగ చూచెను యమునమ్మ ; ||

మల్లెల పొదలలొ దోబూచి -

ఎంత వెదికినా దొరకని లీలలు -

నట-నావతంసునికి బాగ ఎరుక కద!

వేగమె దొరకర క్రిష్ణయ్యా! ......,

వైళమె నీవు అగుపడకుంటే -

నీకు ఆటకు ఠీ ఠీ ట్ఠీ ;

కటీఫ్ కొడితే ఆట కట్టు అగు ;

కథ కంచికి - అంటూ ఆట కట్టును ; ||

తన మేనుకు అలదెను పూవుల పుప్పొడి -

లతలు, చెట్లు పుప్పొళ్ళను అలిమెను -

కన్నయ ఒడలుకు అలిమెను తావులు -

తెలి తెలిమల్లెల పరిమళమ్ములు -

పట్టి ఇచ్చునవి క్రిష్ణుని జాడలు -

చెంగున దూకి మోహన కృష్ణుని పట్టుకొనేరు ;

పట్టిరి అందరు పరమాత్ముడిని -

శ్రీకృష్ణ పరమాత్ముడిని - ఛాంగు భళా! -

ఇతడేనమ్మా చెంగుల కొంగుల బంగారమ్ము ; ||

========================= ,

ATalu aMTE rAdhamma - 

            pATalu aMTE krishNayya ;

ATaku - pATaku kudirina lamkenu -

wimtaga cuucenu yamunamma ; ||

mallela podalalo dObUci -

emta wedikinaa dorakani leelalu -

naTanaawatamsuniki baaga eruka kada!

wEgame dorakara krishNayyA!

waiLame neewu agupaDakumTE -

nIku ATaku ThI ThI TThI ;

kaTIph koDitE ATa kaTTu agu ;

katha kamciki - amTU ATa kaTTunu ; ||

tana mEnuku aladenu puuwula puppoDi -

latalu, ceTlu puppoLLanu alimenu -

kannaya oDaluku alimenu taawulu -

teli telimallela parimaLammulu -

paTTi iccunawi krishNuni jADalu -

cemguna duuki mOhana 

            kRshNuni paTTukonEru ;

paTTiri amdaru - paramaatmuDini -

SrIkRshNa paramaatmuDini - CAmgu BaLA! -

itaDEmmA, cemgula komgula bamgaarammu ; ||

శ్రీకృష్ణ లీలలు - గానసుధలు -161 ;- ఆట పాటల రాధాక్రిష్ణ - 161 ; 

 శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2024 ; 

BlAg archives - Labels 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి