3, ఫిబ్రవరి 2024, శనివారం

నానావిధముల అలజడి - 156

నానావిధముల అలజడి ; 

విశాలనీలి గగనములోన ; ||

"కర్రి మబ్బులు - తొర్రి చేయునవి -

పదే పదే - నాకడ్డు వచ్చునని -

జాబిలి ఎంతో విసుగుకొనేను ; ||

క్రిష్ణుని రాసక్రీడల చూడగ -

ఎంతో కోరిక చందమామకు ;

"నీ దృష్టి తగులునని,

దాచితి క్రీడా దృశ్యమాలికను -

    కొంటెగ పలికెను అంబరము,

            నీలాంబరము ; ||

వెంటనె వెన్నెల కురిపించి, 

యమునా తరగల అద్దములందున -

ఆటపాటల సంరంభములను -

వీక్షించేను గడసరి పున్నమి చంద్రయ్య ; 

రాధాక్రిష్ణ్ల ఆటపాటల సంరంభములను -

వీక్షించేను గడసరి పున్నమి చంద్రయ్య ; || 

============================ ,

naanaawidhamula alajaDi ; 

wiSAlaneeli gaganamulOna ; ||

"karri mabbulu - torri cEyunawi -

padE padE - naakaDDu waccunani -

jaabili emtO wisugukonEnu ; ||

krishNuni raasakreeDala cUDaga -

emtO kOrika camdamaamaku ;

"nee dRshTi tagulunani,

daaciti krIDA dRSyamaalikanu -

        komTega palikenu ambaramu, 

                  neelAMbaramu ; ||

wemTane wennela kuripimci, 

yamunaa taragala addamulamduna -

ATapATala sam rambhamulanu -

weekshimcEnu gaDasari punnami camdrayya ; 

raadhaakrishNla ATapATala sam rambhamulanu -

weekshimcEnu gaDasari punnami camdrayya ; ||

శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2024 ;  God krishna song- 156 ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి