రసరమ్య గీతిక, రమణీయ వేదిక ;
నవనవోన్మేషమీ బృందావని -
లావణ్య మధుసీమ - ఈ నంద గోకుల వనము ;
సానంద సమ్మోద పులకింత భావముల -
తేజరిల్లుతున్న బృందావనమ్ము,
- సౌందర్య ఉపవనమ్ము ; ||
రమణి రాధామణి ,
- "హంసనడకల ముద్ర" లపురూపము గదా ;
వేయి రేకుల పద్మ పరిమళముల జల్లు -
నలువంకలందున పరివ్యాప్తి గాంచేను ; ||
పలు తావులందున నీ అడుగుదమ్ములలోన -
వనమయూరములు అడుగులేసేను ;
"నడక వయ్యారముల" గురువు -
నీవేనమ్మ, ఓ రాధికా!!
శ్రీకృష్ణ వేణు గాన రాగమ్ములు -
నీ అడుగుజాడలను అనుసరిస్తూన్నవి,
ముగ్ధ సౌందర్యాల ప్రోవు, నీవేనమ్మ,
నీ చరణపద్మముల ధరణి పులకించేను,
రావమ్మ రాధికా, రసరమ్య గీతికా! ; ||
======================== ,
rasaramya geetika, ramaNIya wEdika ;
nawanawOnmEshamee bRmdAwani -
laawaNya madhuseema - ,
- ee namda gOkula wanamu ; ||
saanamda sammOda pulakimta BAwamula -
tEjarillutunna bRmdAwanammu ,
saumdarya upawanammu ; ||
ramaNi raadhaamaNi -
"hamsanaDakala mudra" -
- lapuruupamu gadaa ;
wEyi rEkula padma parimaLamula jallu -
naluwamkalamduna pariwyaapti gaamcEnu ; ||
palu taawulamduna nee aDugudammulalOna -
wanamayuuramulu aDugulEsEnu ;
"naDaka wayyAramula" guruwu -
neewEnamma, O rAdhikA!!
SreekRshNa wENu gAna raagammulu -
nee aDugujADalanu anusaristuunnawi,
mugdha saumdaryAla prOwu, neewEnamma,
nee caraNapadmamula dharaNi pulakimcEnu,
rAwamma rAdhikA, rasaramya geetikA! ; ||
prev = శ్రీకృష్ణ లీలలు - గానసుధలు - 177 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి