కయ్యాలు పెట్టుటలో బహు మేటి కన్నయ్య ;
తయ్యారు ఔతాడు,
ప్రతి నిముషము, ప్రతి క్షణము ; ||
"నీలాదేవీ! - నీకు చెప్పకుండ -
నీళ్ళ కడవ తోటి, 'జమున' -
మన ఊరి కాళిందీ నది వద్దకు -
వెళ్ళింది ఇప్పుడే! ఇదేనా - మైత్రి విలువ?"
అంటూను కొండేలు చెప్పుతాడు
ఒకరి మీద ఒకరికి ; ||
కాళిందీ నది కాడ చేరి,
"మీ నేస్తం -
మధురకు వెళ్ళెను పాలకుండలతో"
చాడీలు చెబుతాడు వీడు -
తంటాలమారివాడు ; ||
జవరాలు రాధ కడకు - చేరుతాడు కట్టకడ -
వెన్నదొంగ గోవిందుని గుణములెల్ల -
ఔపోసన పట్టినట్టి ప్రేమిక - మన రాధిక -
ఓ పట్టాన - నమ్మునా!?
నవనీతచోరుని - నందబాలు లీలలివి ;
నమ్మదులే, ఒక పట్టున ;
పెదవి మేలిముసుగులందు
తొణికించును చిరునగవులు ; ||
===================== ,
kayyaalamaari kannayya - 157 ;-
kayyaalu peTTuTalO bahu mETi kannayya ;
tayyaaru autADu,
prati nimushamu, prati kshaNamu ; ||
"neelaadEwii! - neeku ceppakumDa -
nILLa kaDawa tOTi, jamuna -
mana uuri kALimdee nadi waddaku -
weLLimdi ippuDE! idEnaa - maitri wiluwa?"
amTuunu komDElu cepputaaDu
okari meeda okariki ; ||
kALimdee nadi kADa cEri,
"mee nEstam -
madhuraku weLLenu paalakumDalatO"
cADIlu cebutADu wIDu - tamTAlamaariwADu ; ||
jawaraalu raadha kaDaku -
cErutADu kaTTakaDa -
wennadomga gOwimduni guNamulella -
aupOsana paTTinaTTi prEmika -
mana raadhika -
O paTTAna - nammunaa!?
nawaneetacOruni - namdabaalu leelaliwi ;
nammadulE, oka paTTuna ;
pedawi mElimusugulamdu
toNikimcunu cirunagawulu ; ||
& శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2024 ; God krishna song- 157 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి