మీనావతారుడు కొంటెక్రిష్ణుడు -
ఈశునికి భలే మంచి కానుకను ఇచ్చాడు ;
నేడు - భలే మంచి కానుక ఇచ్చాడండీ! ; ||
మబ్బు వల*ను వేస్తున్నవి మిణుకు తారలు -
చందమామ చందమామ చందమామ ; ||
మెరుపు గాలమేసింది వర్షరాణి -
చందమామ చందమామ చందమామ ; ||
తారంగం బాలుడు కృష్ణుడు -
ఆటవస్తువనుకొనెను చందమామను ;
అద్దంలో ఒడిసిపట్టి చందమామను -
బాలక్రిష్ణ ఒడిలోన పెట్టినారు - గోపీజనులు ;
పదిలంగా పెట్టినారు గోపీజనులు ; ||
శిఖిపింఛధారుడు, మోహన క్రిష్ణ -
దోబూచి ఆడాడు చందమామతో ;
మత్స్యరూప అవతార క్రిష్ణమూరితి -
శూలపాణి మహేశునికి చందమామనిచ్చేను ;
ఇంత మంచి బహుమానం ఎవ్వరికైనా -
నచ్చకుండ ఉంటుందా!? మీరే చెప్పండి!
ఆహాహా! నాటినుండి హిమనగవాసి -
బాలేందుశేఖరుడై ప్రభలనీనుచుండెను ;
హరిహరాత్మకం, దైవభావనం -
నెమలికన్ను ఓలె - కాంతులెగయుచుండెను ; ||
ఇంటింటను వెలిసేను దివ్వెల హారమ్ములు ;
దీపావళి గృహసీమల జగతి శోభలు ; ||
&
వల* = net ;
========================= .
meenaawataaruDu komTekrishNuDu -
ISuniki BalE mamci kaanukanu iccADu ;
nEDu - BalE mamci kaanukanu iccADamDI! ; ||
mabbu wala*nu wEstunnawi miNuku taaralu -
camdamaama camdamaama camdamaama ; ||
merupu gaalamEsimdi warsharANi -
camdamaama camdamaama camdamaama ; ||
taarangam baaluDu kRshNuDu -
ATawastuwanukonenu camdamaamanu ;
addamlO oDisipaTTi camdamaamanu -
baalakrishNa oDilOna peTTinaaru - gOpeejanulu ;
padilamgaa peTTinaaru gOpeejanulu ; ||
SiKipimCadhAruDu, mOhana krishNa -
dObUci ADADu camdamaamatO ;
matsyaruupa awataara krishNamuuriti -
SUlapANi mahESuniki camdamaamaniccEnu ;
imta mamci bahumaanam ewwarikainaa -
naccakumDa umTumdA!? meerE ceppamDi!
Ahaahaa! nATinumDi himanagawaasi -
baalEmduSEKaruDai prabhalaniinucumDenu ;
hariharaatmakam, daiwaBAwanam -
nemalikannu Ole - kaamtulegayucumDenu ; ||
imTimTanu welisEnu diwwela haarammulu ;
deepaawaLi gRhaseemala jagati SOBalu ; ||
&
wala* = net ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి