3, ఫిబ్రవరి 2024, శనివారం

కొనగోరు - కలము పాళీ - 166

ముగ్ధ రాధిక కన్నుల కరిగే కాటుకతో,

తన కంటి నీలాల కజ్జలమ్ముతో -

ఉత్తరమ్మును వ్రాయుచున్నది,

క్రిష్ణ ప్రేమిక, బేల రాధిక ; ||

ఆతృత హెచ్చయి, వణకుచున్నది ;

పెను ఆతృత హెచ్చయి, వణుకుచున్నది ;

కృష్ణుడు వేగమె వచ్చునా- అని ; ||

"కొనగోరు - కలము పాళీ"ని వంచి -

వ్రాయుచున్నది పణతి రాధిక ; ||

కన్నీటిధారలే లిపి అక్షరమ్ములు ;

అక్షరశ్రేణులు పేరుకొనేను,

వేదన పొరలిన తాత్వికచింతన -

శ్రీకృష్ణా! నీకై ఎదురుచూచుచూ,

సవినయమ్ముగా మనవి చేయుచూ,

ఇటుల, చిత్తగించవలెను ;

ఇట్లు, చిత్తగించవలెను ; ||

======================== ,

pATa - 2;-

mugdha raadhika kannula karigE kaaTukatO,

tana kanTi neelaala kajjalammutO -

uttaramuunu wraayucunnadi,

SrIkrishNA, prEmika, bEla raadhika ; ||

AtRta hecchayi, waNakucunnadi ;

penu AtRta hecchayi, waNukucunnadi ;

kRshNuDu wEgame waccunaa- ani ; ||

"konagOru - kalamu pALI"ni wamci -

wraayucunnadi paNati raadhika ; ||

kannITidhaaralE lipi aksharammulu ;

aksharaSrENulu pErukonEnu,

wEdana poralina taatwikacimtana -

SrIkrshNA! neekai edurucuucucuu,

sawinayammugaa manawi cEyucU,

iTula, cittagimcawalenu ;

iTlu, cittagimcawalenu ; || 

====================== === ;

& part - పార్ట్ ;- 1 ; శ్రీకృష్ణ లీలలు - గానసుధలు -166 =  [=ఇట్లు, చిత్తగించవలెను ; ||] ;

 శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2024 ; 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి