19, ఫిబ్రవరి 2023, ఆదివారం

రంజుగ పోటీ - 115

పౌర్ణిమ యామినికి, 
నీలి యమున -అలల ఉధృతికి  ;

రంజుగ పోటీ సాగుతున్నది, చూడండీ ; || 

నీలి మబ్బుల విశాల రెక్కలు - నిడివిగ సాచెను ; 

చక్కని వెన్నెల బంగరు పక్షి ; 

సాగుతున్నది దిశల అవధులకు ; ||

పరుగులు తీస్తూ - పడతి రాధిక ;

జిలుగు పావడా, వలువల పైన -

తన అందము మరింత ఇనుమడించగా ;

మురిసిపోవుచూ సాగుతున్నది ;

శరత్ చంద్రిక - 

మురిపాలు పోవుచూ సాగుతున్నది ; ||

యమున అలలలో - తళుకు రాగిణులు ; 

క్రిష్ణ ప్రియసఖి - వస్త్రములందున ;

సరిగంచు బుటాల -

జిగినీ మెరుపులు చేరసాగినవి ; ||

పున్నమి చంద్రిక - ఝరీ తరంగిణి -

ఇరువురి నడుమను పోటీ ఇపుడు -

బహు, రంజు రంజుగా  సాగుతున్నది, చూడండీ ; ||

======================,

paurNima yaaminiki, 

neeli yamuna alala udhRtiki ;

ramjuga pOTI saagutunnadi, cUDamDI ; ||  

nIli mabbula wiSAla rekkalu - 

niDiwiga saacenu ; 

cakkani wennela bamgaru pakshi ; 

saagutunnadi diSala awadhulaku ; ||

parugulu teestuu - paDati raadhika ;

jilugu paawaDA, waluwala paina -

tana amdamu marimta inumaDimcagA ;

murisipOwucU saagutunnadi  ;

Sarat camdrika -

muripaalu pOwucU saagutunnadi  ; ||

yamuna alalalO - taLuku raagiNulu ; 

krishNa priyasaKi - wastramulamduna ;

sarigamcu buTAla -

jiginee merupula cErasaaginawi ; ||

punnami camdrika - jharI taramgiNi -

iruwuri naDumanu pOTI ipuDu -

bahu, ramju ramjugA sAgutunnadi, cUDamDI ; ||

&  శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ; రంజుగ పోటీ - 115 ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి