వనిత ఓర చూపుల ఘనత - 105 ;
పంతపు చూపుల బాణాలిచ్చి ;
మన్మధ శరాళి, బలమును పొందెను ;
తృటిలో ఇటుల, మారె ప్రపంచము,
ఎటుల, ఎటులెటుల -
ఈలాటి వింతలు తోచుట ఇటుల? ; ||
బులిబులిగా మము, ఇటు కవ్వించి ;
జిలిబిలి కవితల కావ్యాలెన్నో ;
ముల్లోకములకు దండిగ ఇచ్చిన -
నీ ఓర చూపులకు, మా అల్లరి క్రిష్ణునితో పాటు -
మా జోహార్లును కోటిశతములు -
గైకొనుమా రాధారమణీ,
లలితాంగి, కోమలీ ;
మరకత ఛాయల మేను వాని - ఇష్టసఖీ!
కృష్ణుని ప్రియ మణీ ; ||
=================== ,
wanita Ora cuupula ghanata - 105 ;
pamtapu cuupula bANAlicci ;
manmadha SaraaLi, balamunu pomdenu ;
tRTilO iTula, mAre prapamcamu,
eTula, eTuleTula -
eelATi wimtalu tOcuTa iTula? ; ||
bulibuligaa mamu, iTu kawwimci ;
jilibili kawitala kaawyaalennO ;
mullOkamulaku damDiga iccina -
nee Ora cuupulaku, maa allari krishNunitO pATu -
maa jOhaarlunu kOTiSatamulu -
gaikonumaa raadhaaramaNI,
lalitaamgi, kOmalI ;
marakata CAyala mEnu waani - ishTasaKI!
kRshNuni priya maNii ; ||
;
వనిత ఓర చూపుల ఘనత - 105 ; - శోభకృత్ రాధాకృష్ణ గీతాలు 2023 ; song - 105 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి