3, మే 2022, మంగళవారం

కూడికలు, హెచ్చవేత, భాగహారములు

 చందమామ ఉపాధ్యాయ - పటుతరమౌ బోధన ;

చుక్కల గిలిగింతల పటిష్ఠ - మిణుకు మిణుకులు ; ||

గురివింద పొద చాటున -

ఏమిటి ఆ అలజడి? - ఏమో ఆ సందడి ?

ఆకులకు ఆ అలికిడి, ఆ సందడి ;

అది పత్రాల వాద్యాల - గీత సందడి ;

పూవుల మకరందాలకు - సౌందర్య కూడికలు ; ||

కీలాగ్ర పుప్పొడులకు హెచ్చింతలు,

హెచ్చు హెచ్చు హెచ్చవేతలు ; ||

రాధ, గోపి కోలాటం ఆటలలో హుషారులు ;

క్రిష్ణ మురళి మేళవింపు - ఆనందం -

అదనంగా అందేను చెవికి ఇంపు ;

పరస్పరం ఆమోద - సమ్మోద భావ హారమ్ములు ;

నిశీధి భాగహారమ్ములు ; ||

==================,

camdamaama upaadhyaaya - paTutaramau bOdhana ;

cukkala giligimtala paTishTha - miNuku miNukulu  ; ||

guriwimda poda cATuna EmiTi A alajaDi? 

EmO A samdaDi ?

aakulaku aa alikiDi, aa samdaDi ;

adi patraala wAdyaala - geeta samdaDi ;

pUwula makaramdaalaku - saumdarya kUDikalu ; ||

keelaagra puppoDulaku heccimtalu,

heccu heccu heccawEtalu ; ||

raadha, gOpi kOlATam aaTalalO hushaarulu ;

krishNa muraLi mELawimpu - aanamdam -

adanamgaa amdEnu cewiki impu ;

parasparam AmOda - sammOda BAwa hArammulu ;

niSIdhi BAgahaarammulu ; || 

&

song 34 ; శుభకృత్ సుమ గీత మాలిక - 34 ; రచయి3 = కుసుమ ; 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి