11, మే 2022, బుధవారం

కొండగాలి వీచింది

కొండగాలి వీచింది ;

బంగారు శంఖమ్ములోకి ;

పార్ధసారధి ఊదేటి శంఖమ్ములోనికి ; ||

కొండగాలి దూరింది -

ఇందీవర శ్యాముని మురళిలోనికి ; ||

కొండగాలి జారుతోంది -

యమునా జల అలలలోకి - 

తళుక్కుమని - అలలపైకి ; ||

కొండగాలి విస్తరింపు -

రసగానలోల భక్తజనుల - 

హృదయాలలోనికి ; ||

కొండగాలి కింత చొరవ ... ,

ఔరా! ఆహాహా ... , - ఎందువలన అంటే -

తాను - చిన్ని పిల్లనగ్రోవిలోన ; 

మధురవళిగ మారేందుకు ; 

మృదువు మృదువుగా ; 

మృదు మధురమ్ముగ పరిణమిస్తు... , 

పరిణమిస్తు పరిణమిస్తు - 

పరిఢవిల్లుతూ .... ;

===============,

komDagaali weecimdi ; 

bamgaaru SamkhammulOki ;

paardhasaaradhi uudETi SamkhammulOniki ; ||

komDagaali duurimdi -

imdeewara Syaamuni - muraLilOniki ; ||

komDagaali jaarutOmdi -

yamunaa jala alalalOki - 

taLukkumani - alalapaiki ; ||

komDagaali wistarimpu -

rasagaanalOla bhaktajanula -hRdayaalalOniki ; ||

komDagaali kimta corawa ... ,

auraa! aahaahaa ... ,

emduwalana amTE -

taanu - cinni pillanagrOwilOna ; 

madhurawaLiga maarEmduku ; 

mRduwu mRduwugaa ; 

mRdu madhurammuga pariNamistu... , 

pariNamistu pariNamistu - 

pariDhawillutuu .... ; 

& ;- 

శుభకృత్ సుమ గీత మాలిక - 44 ; రచయి3 = కుసుమ ;  & + Ksp రాధా వేణు రవళి ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి