రేయి నింగి నల్లన - యమున నీరు నల్లన ;
ముద్దు కన్న* మేను రంగు నల్లన ;
నలుపు వన్నె అంటేనే -
గోపికేల భయమాయెను!? ||
అల్లనల్లనదే అదే - వెలిసినది నెలవంక ;
ఇల మీద ఇక్కడనే - వెలసె కొత్త చంద్రవంక ;
అట విదియ చంద్రరేఖ -
ఇటు భువిని నవ్య కౌముది ... ;
ఇదేమి వింత, చెప్పరే, చెలియలార ....... ;
చెక్కిలి పయి వేలు ఉంచి, అంత యోచనా!? ;
విప్పేయగలదు రాధిక, ఇందులోని చిక్కు ముడిని ; ||
పొడుపు కథల ఆటలను, నేర్చె కదా రాధిక ;
క్రిష్ణుని కడ ; చాల నేర్చె కదా రాధిక ;
చెప్పింది ఇట్టే ఆ సమాధానము - ;
ముద్దు కృష్ణ చిరునవ్వే - భువి పైన ఉన్న నెలవంక ;
అంబరాన చంద్రకళ - 'ఔనులే' అన్నది -
తాను - నిలువెల్లా నవ్వు ఔతూ ...;
అయ్యారే చప్పట్లు, చమత్కార జవాబుల ;
గడుసు ముదిత రాధమ్మకు ;
మన ముత్తు క్రిష్ణ - శిష్యిణి రాధమ్మకు ; ||
;
ముద్దు కన్న* = Krishna as child ;
=====================,
rEyi nimgi nallana ; yamuna neeru nallana ;
muddu kanna mEnu ramgu nallana ;
nalupu wanne amTEnE -
gOpikEla bhayamaayenu!? ||
allanallanadE adE - welisinadi nelawamka ;
ila meeda ikkaDanE - welase kotta camdrawamka ;
aTa widiya camdrarEKa -
iTu bhuwini nawya kaumudi ... ;
idEmi wimta, cepparE, celiyalaara ....... ;
cekkili payi wElu umci, amta yOcanA!? ;
wippEyagaladu rAdhika, imdulOni cikku muDini ; ||
poDupu kathala ATalanu, nErce kadaa rAdhika ;
krishNuni kaDa ; caala nErce kadaa rAdhika ;
ceppimdi iTTE aa samAdhAnamu - ;
muddu kRshNa cirunawwE - bhuwi paina unna nelawamka ;
ambaraana camdrakaLa -'aunulE' annadi -
taanu - niluwellA nawwu autuu ...;
ayyArE cappaTlu, camatkAra jawAbula ;
gaDusu mudita raadhammaku ;
mana muttu krishNa - SishyiNi rAdhammaku ; ||
********************************************* ;
& శుభకృత్ సుమ గీత మాలిక - 29 ; రచయి3 = కుసుమ ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి