సోకులన్ని తనవేలే - మూరెడంత వంశీ ;
సోకులన్ని తనవేలే ; ||
కృష్ణయ్య - పద్మహస్తములందున చేరెను -
బుల్లి వెదురుబద్ద ఇపుడు, పిల్లనగ్రోవిగ మారె - అదీ కథ ;
||సోకులన్ని తనవేలే! ||
కామదేవు జన్మదాత - చిగురువేళ్ళ శక్తి, మహిమ -
చందము అది - చిందించును సంగీతము ;
||సోకులన్ని తనవేలే||
ఆస్థాన- వాయిద్యమాయె - చిట్టి మురళి ;
మధుర రాగ సం స్థానముగా - వెలిసింది నేడు చూడు సఖీ!
కృష్ణమూర్తి - పద్మహస్తముల చేరెను -
బుల్లి వెదురుబద్ద ఇపుడు, పిల్లంగ్రోవి ఆయె- అదీ కథ ;
సోకులన్ని తనవేలే ;
========================= ,
bulli wedurubadda pillanagrOwiga mArinadi ;- song ;-
sOkulanni tanawElE - muureDamta wamSI ;
sOkulanni tanawElE ; ||
kRshNayya - padmahastamulamduna cErenu -
bulli wedurubadda ipuDu, pillanagrOwiga mAre - adee katha ;
||sOkulanni tanawElE! ||
kaamadEwu janmadaata - ciguruwELLa Sakti, mahima -
camdamu adi - cimdimcunu samgeetamu ;
||sOkulanni tanawElE||
aasthAna- waayidyamaaye - ciTTi muraLi ;
madhura raaga sam sthaanamugaa - welisimdi nEDu cuuDu sakhee!
kRshNamuurti - padmahastamula cErenu -
bulli wedurubadda ipuDu, pillamgrOwi aaye- adee katha ;
sOkulanni tanawElE ;
& శుభకృత్ సుమ గీత మాలిక - 57 ; రచయి3 = కుసుమ ; & + Ksp రాధా వేణు రవళి ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి