కువలయ దళనేత్రి రాధ - సన్నిధికి అరుగుచుండె -
శ్వేతపుష్ప పరిమళాలు - విశ్వగాన సంభ్రమాలు ; ||
తెలి - కలువరేకుల పాట - గురువు రాధ మ్రోలనే -
రాగ సాధనలు - చేయు శిష్య వలయ -
కువలయ సుమ సందోహము ; ||
కృష్ణపారిజాతమాలల - మధుతావులు ఉప్పొంగెను ;
మిత్ర కలువబాలలు - చేయుచున్న పరిచయ కృతి -
సౌరభాల విభ్రమాలు - రాణువ కెక్కుచున్న -
భవ్య కృష్ణ గానమ్ములకు - దొరికె కొత్త చరణమ్ముల -
అభ్రకద్యుతి హేలల సిరి లాలనలు -
ఇంపుసొంపు గమకమ్ముల మేళవింపు ; ||
=================== ;
kaluwarEkula pATa - guruwu rAdha ;-
kuwalaya - daLanEtri raadha - sannidhiki arugucumDe -
SwEtapushpa parimaLAlu - wiSwagaana sambhramaalu ; ||
teli - kaluwarEkula pATa - guruwu raadha mrOlanE -
raaga saadhanalu - cEyu Sishya walaya -
kuwalaya suma sam dOhamu ; ||
kRshNapaarijaatamaalala - madhutaawulu uppomgenu ;
mitra kaluwabaalalu - cEyucunna paricaya kRti -
saurabhaala wibhramaalu - raaNuwa kekkucunna -
bhawya kRshNa gaanammulaku - dorike kotta caraNammula -
abhrakadyuti hElala siri laalanalu -
impusompu gamakammula mELawimpu ; ||
;
& శుభకృత్ సుమ గీత మాలిక - 56 ; రచయి3 = కుసుమ ; & + Ksp రాధా వేణు రవళి ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి