ఎంతమాత్రమూ హెచ్చులు కాదులె ;
వ్రేపల్లె భాగ్యములు - వాస్తవమ్ములే ;
సహజోక్తులులే ; ||
రాసక్రీడల ఆటల పాటల - పాటవమ్ములు ;
సుపరిచితాలు - ఈ గ్రామమునకు -
పంచదారగుళికలు - తానెన్నడో -
దానము చేసెను, కాబోలు ;
దీపావళిని పర్వదినముగా -
ప్రపంచమ్మునకు తానిచ్చినది ; ||
భోగ*శయనుడు - భోగఫణమ్ముల -
నాట్యాసక్తి చోద్యమటే!?
ఎంతమాత్రమూ హెచ్చులు కాదులె ;
వ్రేపల్లె భాగ్యములు - వాస్తవమ్ములే ;
సహజోక్తులులే ; ||
& భోగ*శయనుడు = *శేషశాయి ;; భోగఫణి* = కాళీయుడు ;
============================= ,
emtamaatramuu hecculu kAdule ;
wrEpalle BAgyamulu - waastawammulE ;
sahajOktululE ; ||
raasakrIDala ATala pATala - paaTawammulu ;
suparicitaalu - ee graamamunaku -
pamcadaaraguLikalu - taanennaDO -
daanamu cEsenu, kaabOlu ;
deepaawaLini - parwadinamugaa -
prapamcammunaku taaniccinadi ; ||
BOga*SayanuDu - bhOgaphaNammula -
naaTyaasakti cOdyamaTE!?
emtamaatramuu hecculu kAdule ;
wrEpalle BAgyamulu - waastawammulE ;
sahajOktululE ; ||
& BOga*SayanuDu = *SEshaSAyi ;; bhOgaphaNi* = kaaLIyuDu ;
& శుభకృత్ సుమ గీత మాలిక - 51 ; రచయి3 = కుసుమ ; & + Ksp రాధా వేణు రవళి ;;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి