మధుకుంజమ్ముల భృంగతతుల -
విభ్రమ క్రీడలు, సంభ్రమమ్ములు -
రమణి రాధిక - భ్రూ విభ్రమ చలన -
అభ్రక కాంతుల నాట్య భంగిమల -
లయగతి - సంగతి గమక శృతి ; ||
అల్లవిగో, మేఘాడంబర పటహధ్వనులు -
ఫెళఫెళార్భటులు ;;
భయవిహ్వలయై యమునాతటిని -
నిలిచెను రాధ -
పిల్లనగ్రోవిని తడవనీయక -
చెంగున దాచెను భద్రముగా ;
నీవు వత్తువని -
మురళిని నిమిరి - మృదుగానములను -
జగతి కొసగుదువని ....,
ముగ్ధ రాధిక - వేచిఉన్నది ; ||
===============,
madhukumjammula BRmgatatula -
wibhrama krIDalu, sambhramammulu -
ramaNi raadhika - bhruu wibhrama calana -
abhraka kaamtula nATya bhamgimala -
layagati - samgati gamaka SRti ; ||
allawigO, mEGADambara paTahadhwanulu -
pheLapheLArBaTulu ;;
bhayawihwalayai yamunaataTnii -
nilicenu raadha -
pillanagrOwini taDawaneeyaka -
cemguna daacenu bhadramugaa ;
niiwu wattuwani -
muraLini nimiri - mRdugaanamulanu -
jagati kosaguduwani ....,
mugdha rAdhika - wEciunnadi ; ||
& శుభకృత్ సుమ గీత మాలిక - 51 ; రచయి3 = కుసుమ ; & + Ksp రాధా వేణు రవళి ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి