రేయికి పెను చీకటి - నలుపు రంగు నిండుగా ;
ప్రాధేయపడెను జాబిల్లిని - వెన్నెలను - నింపమని ;
తనలోన వెన్నెలను - నింపమని ; ||
కొంటె జాబిల్లికిపుడు - తమాషాలు చేయ బుద్ధి పుట్టె ;
బెట్టు చేసె మెండుగా, మోము చాటు చేసెను,
అమవాస్యను వెదజల్లెను - నింగిలోన అమవాస్యను వెదజల్లెను ; ||
నల్లనివాడు - యశోద ముద్దుపట్టి - నీలమోహన కృష్ణుడు ;
కితకితలు పెట్టినారు - చమత్కార గోపి, రాధ ;
పకపక నవ్వాడు క్రిష్ణ - మన బాల శ్యామ కృష్ణమ్మ ;
దరహాస తెలి కాంతి ప్రభలు - ఎగసెనండి నింగి దాక ;
ఆ నగవుల వెన్నెలల - పున్నమియై విరిసె రాత్రి ; ||
=================,
rEyiki penu ceekaTi - nalupu ramgu nimDugaa ;
prAdhEyapaDenu jaabillini - wennelanu - nimpamani ;
tanalOna wennelanu - nimpamani ; ||
komTe jAbillikipuDu - tamAshAlu cEya buddhi puTTe ;
beTTu cEse memDugaa ; mOmu cATu cEsenu,
amawaasyanu wedajallenu ;
nimgilOna amawaasyanu wedajallenu ; ||
nallaniwADu - yaSOda muddupaTTi ;
neelamOhana kRshNuDu ;
kitakitalu peTTinaaru ;;
camatkaara gOpi, raadha ;
pakapaka nawwADu krishNa -
mana baala Syaama kRshNamma ;
darahaasa teli kaamti prabhalu - egasenamDi nimgi daaka ;
aa nagawula wennelala - punnamiyai wirise raatri ; ||
&
శుభకృత్ సుమ గీత మాలిక - 25 ; రచయి3 = కుసుమ ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి