1] మైనాల పాటలకు , చిలక పలుకులకు -
కొత్త పల్లవి చరణాల ;
చెబుతూన్నట్లే ఉన్నది, అందిస్తున్నట్లుగానే ఉన్నది ;
2] మిలమిలల అల్లరిని - కృష్ణ చెలి రాధిక -
చెవుల జూకాలకు - తావి జూకా మల్లె -
చెబుతున్నట్లే ఉన్నది, అందిస్తున్నట్లే ఉన్నది ;
3] గలగలల రంగుల సున్నితపు గాజులు ;
వడ్డాణ పట్టీల చిరు గంట, అందియలు ;
మమతానురాగాల స్వచ్ఛతల తీపిని ;
చెబుతూ ఉన్నట్లే ఉన్నది, అందిస్తున్నట్లే ఉన్నది ;
4] కిలకిలల నవ్వుల పెదవి వంపులలోన - చిక్కిన చిరుగాలి ;
సంగీత, నాట్యాల - గురు కళల కూర్మిని ;
విశ్వమెల్లెడలా చాటుతున్నటే ఉన్నది .....,
వివరించి, చెబుతున్నట్లే ఉన్నది, అందిస్తున్నట్లే ఉన్నది ; ||
రాధికను తలచుకుని, ఇన్నిన్ని ఊసుల - తలపోతల వెతలు ;
క్రిష్ణునికి సిగముడిని మెరిసేటి పింఛము
తెలుసుకుని, జవ్వని రాధికకు -
చెబుతున్నట్లే ఉన్నది, అందిస్తున్నట్లే ఉన్నది ; ||
;
=============================,
1] mainAla pATalaku ; cilaka palukulaku ;
kotta pallawi caraNAla ;
cebutuunnaTlE unnadi,
amdistunnaTlugaanE unnadi ;
2] milamilala allarini - kRshNa celi raadhika -
cewula juukaalaku, taawi juukaa malle -
cebutunnaTlE unnadi, amdistunnaTlE unnadi ;
3] galagalala ramgula sunnitapu gaajulu ;
waDDANa paTTIla ciru gamTa, amdiyalu ;
mamataanuraagaala swacCatala teepini ;
cebutuu unnaTlE unnadi, amdistunnaTlE unnadi ;
4] kilakilala nawwula pedawi wampulalOna - cikkina cirugaali ;
samgeeta, nATyAla - guru kaLala kuurmini ;
wiSwamelleDalaa caaTutunnaTE unnadi .....,
wiwarimci, cebutunnaTlE unnadi, amdistunnaTlE unnadi ; ||
raadhikanu talacukuni, inninni uusula - talapOtala wetalu ;
krishNuniki sigamuDini - merisETi pimCamu ;
telusukuni, jawwani raadhikaku -
cebutunnaTlE unnadi, amdistunnaTlE unnadi ; ||
&
song 40 ; శుభకృత్ సుమ గీత మాలిక - 40 ; రచయి3 = కుసుమ ; ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి