15, మే 2022, ఆదివారం

ఫక్కున చంద్రుడు నవ్వేను

ఫక్కున ఎందుకు నవ్వెను చందురుడు ;

మన రాధమ్మకు - కోపం వచ్చెనని ; ||

ఎపుడూ అలుకలు ఎరుగని పిల్ల -

తమాల పల్లవ సుకుమారి -

మంజీరములు ఘల్లున మ్రోగుతు ;

వంతలు పాడెను - రాధ కినుకకు ; ||

పెంకికృష్ణుడు తుంటరి మాధవ -

మొండిగ పాముతొ - ఆటలాడెనని ;

తెగ నాట్యాలాడుచుండెనని ;

... కారం మిరియాల్ నూరసాగినది -

బాష్పనేత్ర ఈ బాలామణి - అని ;

ఫక్కున నవ్వెను చందురుడు -

మిరియపు వంటల జాణలు -

ఆడువారు* - ఈ స్త్రీలు కదా - అని ;

ఫక్కున నవ్వేను ; || 

&

* ఆడువారు = *ఆడవాళ్ళు ;

===================== ,

phakkuna emduku nawwenu camduruDu ;

mana raadhammaku - kOpam waccenani ; ||

epuDuu alukalu erugani pilla -

tamaala pallawa sukumaari -

mamjeeramulu ghalluna mrOgutu ;

wamtalu pADenu - raadha kinukaku ; ||

pemkikRshNuDu tumTari maadhawa -

momDiga paaamuto - aaTalADenani ;

tega naaTyaalADucumDenani ;

... kaaram miriyaal nuurasaaginadi -

baashpanEtra ee baalaamaNi - ani ;

phakkuna nawwenu camduruDu -

miriyapu wamTala jANalu -

ADuwaaru* -  ee streelu kadaa - ani ;

phakkuna nawwEnu ; || 

&

* ADuwAru = *ADawaaLLu ;

&

శుభకృత్ సుమ గీత మాలిక - 47 ; రచయి3 = కుసుమ ; & + Ksp రాధా వేణు రవళి ;;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి