నీలి కలువ, నీలి కలువ, నీలి కలువ -
పుట్టింది - మన వ్రేపల్లియలోన ; ||
నీలి యమున కెరటాల - పున్నమలు ఎగిసాయి ;
చంద్రకళలు ఆడాయి ;
*షోడశ కళలొకేసారి - కూరిమిని ఆడసాగె ; ||
రాజీవ లోచనుని తిలకిస్తూ - భూదేవి మురిసింది ;
దివికి దూరమిక రద్దు - ఈ భువియె దివిజులకు ముద్దు ;
స్వర్గమునకు - ఇటు - ఇక పయిన - లేదు లెండి, ఏ హద్దు ; ||
=================== ,
neeli kaluwa puTTimdi - wrEpalliyalOna ;
neeli kaluwa, neeli kaluwa, neeli kaluwa -
puTTimdi - mana wrEpalliyalOna ; ||
neeli yamuna keraTAla - punnamalu egisaayi ;
camdrakaLalu ADAyi - *shODaSa kaLalokEsaari -
kuurimini ADasaage ; ||
raajiiwa lOcanuni tilakistuu - BUdEwi murisimdi ;
diwiki duuramika raddu - ee bhuwiye diwijulaku muddu ;
swargamunaku - iTu - ika payina - lEdu lemDi, E haddu ; ||
&
notes ;- *షోడశకళా ప్రపూర్ణుడు చంద్రుడు = 16 కళలు ; &
శుభకృత్ సుమ గీత మాలిక - 64 ;; రచయి3 = కుసుమ ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి