15, మే 2022, ఆదివారం

మంచి నమూనా దొరికింది

మదనుని పత్ని రతీదేవి - పోతపోయసాగెను ;

ఇన్ని యుగాలకు - మనకు -

మంచి నమూనా దొరికెను - అనుచు ; ||

చీటికిమాటికి కదులు ముంగురులు -

సవరించుకొనేను రాధమ్మ ;

గాలి అల్లరిని, జాణతనమ్మును -

కోపగించుకుంటూ -

ప్రణయిని రాధిక కోపగించుకుంటూ ; ||

నవనీతప్రియుడు చాటుగ వచ్చి -

తన మేలిముసుగును, కొంగును పట్టి,

లాగి చిలిపిగా - నవ్వుతు  ఉంటే ;

ప్రణయిని రాధిక కోపగించుకుంటూ ; ||

ఈ కొంటె సన్నివేశం , 

శిల్ప కళలకు బంగరు కానుక -

అమూల్య బహుమతియె, ఓ చెలియా!

కనుకనె, నేడు ;

ప్రణయశిల్పులకు - అంతులేని పని ; || 

================= ;

madanuni patni rateedEwi - pOtapOyasaagenu ;

inni yugaalaku - manaku -

mamci namuunaa dorikenu- anucu ; ||

ciiTikimATiki kadulu mumgurulu -

sawarimcukonEnu rAdhamma ;

gaali allarini, jaaNatanammunu -

kOpagimcukumTU -

praNayini rAdhika kOpagimcukumTU ; ||

nawaneetapriyuDu cATuga wacci -

tana mElimusugunu, komgunu paTTi,

laagi cilipigaa - nawwutu umTE ;

praNayini rAdhika kOpagimcukumTU ; ||

ee komTe sanniwESam , 

Silpa kaLalaku bamgaru kaanuka -

amuulya bahumatiye, O celiyA!

kanukane, nEDu ;

praNayaSilpulaku - amtulEni pani ; ||

&

శుభకృత్ సుమ గీత మాలిక - 46  ; రచయి3 = కుసుమ ; &  Ksp రాధా వేణు రవళి ;  FB ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి