3, మే 2022, మంగళవారం

డెందము - మణి మందిరము

భువనము లన్నింటా నీవేరా , 

త్రిభువనము లన్నింటా నీవేరా, నా స్వామీ ; ||

నా మనసే అలంకృత మందిరము స్వామీ ;

నీవే - కొలువైనందున -

ఈ నా డెందము - మణి మందిరమై -

శోభలందినది, అద్భుతమ్ముగా నా స్వామీ ; ||

నీ చింతన సుధలను అమితముగా ;

గ్రోలిన జన్మము ధన్యముగా ;

అర్ధమ్మిట పరమార్ధమ్మందున ;

లీనమ్మగుటయె - వింతయాయె, నా జీవనమే ; ||

=================,

bhuwanamu lannimTA nIwErA ,

tribhuwanamu lannimTA -

neewErA, nA swAmI||

nA manasE alamkRta mamdiramu swaamI

neewE - koluwainamduna -

I nA Demdamu - maNi mamdiramai -

SOBalamdinadi, adbhutammugA nA swAmI||

nI cimtana sudhalanu amitamugA ;

grOlina janmamu dhanyamugaa ;

ardhammiTa paramaardhammamduna ;

leenammaguTaye wimtayaaye,

naa jeewanamE : ||

&

song - 30 ; శుభకృత్ సుమ గీత మాలిక - 30 ; రచయి3 = కుసుమ ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి