3, మే 2022, మంగళవారం

వెన్నెలలో జలనీలిమ

రేవు నీరు వడపోతలు ;

నీలి యమునాంబుల వడపోతలు ;

ఇట, సంభవించె, చూడండీ ; ||

బిత్తరి చూపుల రాధ -

హత్తెరిగి, తత్తరపాటుల తూపులు ;

వెన్నెల రూపన తనరెను ; ||

రాధ - వీక్షణముల జలదరింపు ;

యమునా జలములకు ;

నిరంతరము - ఎడతెరిపి లేని ఒలికింతలు ; ||

సదా యమున నీలిమలు ;

యువతి రాధ క్రీగంటి జల్లుల -

పూర్ణిమల కరిగెనులే ; ||

========================,

rEwu neeru waDapOtalu ;

neeli yamunaambula waDapOtalu ;

iTa, sambhawimce, cUDamDI ; ||

bittari cuupula raadha -

hatterigi, tattarapATula tuupulu ;

wennela ruupana tanarenu ; ||

raadha - weekshaNamula jaladarimpu ;

yamunaa jalamulaku ;

niramtaramu - eDateripi lEni olikimtalu ; ||

sadaa yamuna neelimalu ;

yuwati raadha kreegamTi jallula ;

puurNimala karigenulE ; ||

 ;

శుభకృత్ సుమ గీత మాలిక - 28 ; రచయి3 = కుసుమ ; 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి