యమునమ్మ నేడు - బొండుమల్లియల తోట ;
యమునలోన - అలలందున ;
పొంగులువారేనండీ - పున్నమీ అందాల నీడలు ; ||
తన్మయాల నాట్యాలు - ఆడేను మయూరి ;
వెన్నముద్దలకు మల్లే - ఈ వెన్నెల బుడగలు ....,
కంటే .... మోదము కలుగనిదెవ్వరికి, ఎవ్వరికి? ; ||
సిగముడిలో పింఛము ; జతగ సాగు మురళిరవళి ;
పడవలోన క్రిష్ణయ్య ఉనికి - దన్నుగ ఉన్నప్పుడు ;
మేదిని మేనున - ఉప్పొంగే నెరివెన్నెల గిలిగింతల ;
ముదములకు ఏమి కొదువ!!? ||
`=======================,
yamunamma nEDu - bomDumalliyala tOTa ;
yamunalOna - alalamduna ;
pomguluwArEnamDI - punnamI amdAla niiDalu ; ||
tanmayaala nATyaalu - ADEnu mayuuri ;
wennamuddalaku mallE - ee wennela buDagalu ....,
kamTE - mOdamu kaluganidewwariki, ewwariki? ; ||
sigamuDilO pimCamu ; jataga saagu muraLirawaLi ;
paDawalOna krishNayya uniki - dannuga unnappuDu ;
mEdini mEnuna uppomgE neriwennela giligimtala ;
mudamulaku Emi koduwa!!? || ;
&
శుభకృత్ సుమ గీత మాలిక - 27 ; రచయి3 = కుసుమ ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి