29, ఏప్రిల్ 2022, శుక్రవారం

అలల నురుగుల దండలు

 అలల నురుగు పూదండలు ; 

వెన్నెలమ్మ విచ్చేసెను ; 

యశోదమ్మకు కనుగీటెను ; 

కన్నయ్యకు సింగారం చేయు మేటిని నేనే -;

సింగారం చేయుటలో నీ కంటే - మేటిని నేనే - 

అంటూను, యశోదతోటి ఒకటే పోటీ ; 

జాబిలీ వెన్నెలమ్మ వేసెను ముందడుగు ; 

శశిచంద్రిక, తానే - వేసేను ముందడుగు ; || 

;

కనుబొమ్మలు ఎగరేస్తూ, మొదలెట్టింది ; 

కడలి అలలు నెలవులుగా చేసుకున్నది  ; 

అలల నురుగు బుడగలన్నిటా - 

వెదజల్లెను పున్నమలను ; 

ప్రతి బుద్బుద మణిని ఏరి, ఆభరణం చేసింది ;

రవల మణులు పొదిగిన తరగ నగలన్నిటిని ; 

క్రిష్ణయ్యకు వేసింది మనసారా ;

యశోదమ్మ, రేవతి నవ్వారు మనసారా ;

పౌర్ణమీ చంద్రికను ; అభినందించారు నోరారా ;

"ఓహోహో వెన్నెలమ్మ, ధన్యమాయె నీ జన్మం" 

అన్నారు ఆ ఇరువురు ; 

ఇరులు సమసి, వెలుగు పగలు ఆయెను కద, 

ఇప్పుడు ఈ రేయి మనసులోని -

ఈసు, అసూయ, పగలు,  

ప్రతీకారమంత - మటుమాయం అయ్యింది ;  ||

&

song - 20 ;; శుభకృత్ సుమ గీత మాలిక ;- 20 ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి