హరివిల్లుకు కొత్త రంగు దొరికింది ;
అరుణాధరముల రాధ - దరహాసమే అది ; ||
మన్మధుని విల్లునకు - బహు తీపి అందినది ;
గడలను వంచేసి - కన్నయ్య తీసేను చెరకు రసములను ;
పుష్పబాణుని జనకుడు తాను,
అలవోక ఆ విద్య, అందు సందేహమా!!? ; ||
రాధమ్మ దోసిటిని నిండుగా - ఇక్షురసములు తొణికె ;
వంగి చూపించగా నింగి - భళి భళీ ;
ఇంద్ర ధనువుప్పొంగె - తన, నవ వన్నియలను గని ; ||
======================== ,
hariwilluku kotta ramgu dorikimdi ;
aruNAdharamula raadha - darahaasamE adi ; ||
manmadhuni willunaku - bahu teepi amdinadi ;
gaDalanu wamcEsi - kannayya teesEnu ceraku rasamulanu ;
pushpabANuni janakuDu taanu,
alawOka aa widya, amdu samdEhamA!!? ; ||
raadhamma dOsiTini nimDugA - ikshurasamulu toNike ;
wamgi cUpimcagA nimgi - bhaLi bhaLee ;
imdradhanu wuppomge - tana, nawa wanniyalanu gani ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి