మధురమైన అక్కర - కలిగె నేడు - ప్రియతమా ;
నెయ్యమున వెన్నదొంగ - బుంగమూతి చూడుమా ;
ఇంత చక్కనైన ఘటన - నయన పూర్ణచంద్రిక ;
మన - నయన పూర్ణచంద్రిక ; ||
చందమామ - దిగి వచ్చెను ;
పెదవి పైని నవనీతం - కలశంలో చేరెను -
కన్నయ్య - పెదవి పైని నవనీతం -
కలశంలో చేరెను ; ||
పున్నమీ జాబిల్లికి - గడుసుదనము హెచ్చెను ;
క్రిష్ణాధరముల తీపియు -
నవనీతం మాధుర్యం - జుర్రుకొనుచు ఉండెను ;
నిండు జాబిల్లి ఇపుడు - పెదవి, వెన్న తీపిదనము -
జమిలిగా ...., జుర్రుకొనుచు ఉండెను ; ||
====================== ,
madhuramaina akkara - kalige nEDu - priyatamaa ;
neyyamuna wennadomga - bumgamuuti cUDumA ;
imta cakkanaina ghaTana - nayana puurNacamdrika ;
mana - nayana puurNacamdrika ; ||
camdamaama - digi waccenu ;
pedawi paini nawaneetam - kalaSamlO cErenu -
kannayya - pedawi paini nawaneetam -
kalaSamlO cErenu ; ||
punnamee jaabilliki - gaDusudanamu heccenu ;
krishNAdharamula teepiyu -
nawaneetam maadhuryam - jurrukonucu umDenu ;
nimDu jaabilli ipuDu - pedawi, wenna teepidanamu -
jamiligaa ...., jurrukonucu umDenu ; ||
&
శుభకృత్ సుమ గీత మాలిక - 3 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి