శేషశయనుడు -
ఆదిశేషశయనుడు, గోవిందుడు ;
మాయామానుష రూపుడు ;
మన మోహనకృష్ణుడు ; ||
;
శేషశాయికి ఇదేమి తుత్తర, నిత్యము తాను ;
పాము పానుపు పయి పవళిస్తుతున్నా,
పాములతోటి ఆటలు వీడు వీడడెప్పుడూ ;
అదేమిటో గాని -
పాములాటలను మానడెప్పుడూ ; ||
;
కాళిందిలొ దూకెను - అల్లరి పిల్లడు -
అనుకున్నామే - అది తప్పు ఆయెను ;
కాళియ సర్పం ఫణాళిని ;
ధిమ్ ధిమ్ ధిత్ ధిత్ ధిత్తళాంగులు -
శుభ చరణముల - ఝళిపించిన స్వర జడి ;
నాట్యశాస్రముకు లక్ష్య సూత్ర విధి ;
లక్షణ నిర్దేశ నిధి ; ................... ;
;
అందులకే కద, ఇతగాడు ఐనాడు అవతారమూరితి -
ఐనాడు తానే - మానవ మానస దైవ స్వరూపము ; ||
=====================, ;
;
aadiSEshaSayanuDu, gOwimduDu ;
kRshNuDu, mana mOhana kRshNuDu ;
maayaamaanusha ruupuDu ;
;
1] SEshaSaayiki idEmi tuttara, nityamu taanu ;
paamu paanupu payi pawaListutunnaa,
paamulatOTi ATalu weeDu, weeDaDeppuDuu ;;
adEmiTo gAni -
paamulATalanu maanaDeppuDU ; ||
;
2] kALimdilo duukenu - allari pillaDu -
anukunnaamE - adi tappu aayenu ;
kaaLiya sarpam phaNALini ;
SuBa caraNamula - dhimm
dhimm dhit dhit dhittaLAmgulu -
jhaLipimcina swara jaDi ;
nATyaSAsramuku lakshya suutra widhi ;
lakshaNa nirdESa nidhi .......... ;
;
amdulakE kada, itagADu ainADu awataaramuuriti -
ainADu tAnE, mAnawa mAnasa daiwa swarUpamu ; ||
&
శుభకృత్ సుమ గీత మాలిక ;- 18 ; song - 18 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి