చందమామ తెలుపుచుండె కృతజ్ఞతలు ;
కృష్ణ మహలు* భూతలము - ఐన విపుల సృజన వీక్షించి -
చందమామ తెలుపుచుండె కృతజ్ఞతలు, జోహారులు ; ||
ముహూర్తవేళ ఆయెను -
మహి ఇపుడు - నాట్య రంగమయే - శుభవేళ ఆయెను ;
క్రిష్ణ నాట్య రంగమయే - శుభవేళ ఆయెను ; ||
Qn ;- వెల ఎంత ప్రవేశముకు?
Answer ;- శరత్ పూర్ణ వెన్నెలంత!
మెరయు చంద్ర వెన్నెల ; ||
అంతలోనె మయూరములు వచ్చి వాలి- పురి విప్పెను ;
బర్హిపింఛమ్ములందు - చాందినీల ఒడిసిపట్టె ;
లిప్తపాటులోననే - తామసమున - తమకమున -
తమ - బర్హిపింఛమ్ములందు - ఒడిసిపట్టె చాందినీలు ; ||
అచ్చమైన చంద్రికలు - బహు బాగుగ విస్తరించె ;
ఆహా, నెరివెన్నెల - ఆహా తెలి వెన్నెల -
సిరి వెన్నెల సోకులన్ని - పుచ్చుకుంది వసుంధర ;
పుణికిపుచ్చుకుంది వసుంధర ; ||
ధర వెన్నెల ఇనుమిక్కిలి ఇనుమడించ -
శశాంకుడు - కృతజ్ఞతలు - నమస్సులు -
జోహారులు, జోతలు - పౌర్ణిమగా విస్తరిస్తు -
విస్తారముగా తెలిపెడి - దృశ్యాలకు -
విస్తుబోవుచున్నారు అందరూ ; ||
&
కృష్ణ మహలు* = మహల్ = building ;
===================== ,
camdamaama telupucumDe kRtajnatalu ;
kRshNa mahalu* bhuutalamu - aina wipula sRjana wIkshimci -
camdamAma telupucumDe kRtajnatalu, jOhArulu;||
muhuurtawELa Ayenu -
mahi ipuDu - nATya ramgamayE - SuBawELa Ayenu ;
krishNa nATya ramgamayE - SuBawELa Ayenu ; ||
`Qn` ;- wela emta prawESamuku?
`Answer` ;- Sarat puurNa wennelamta!
merayu camdra wennela ; ||
amtalOne mayuuramulu wacci waali- puri wippenu ;
barhipimCammulamdu - caamdineela oDisipaTTe ;
liptapATulOnanE - taamasamuna - tamakamuna -
tama - barhipimCammulamdu - oDisipaTTe caamdineelu ; ||
accamaina camdrikalu - bahu baaguga wistarimce ;
aahaa, neriwennela - AhA teli wennela -
siri wennela sOkulanni - puccukumdi wasumdhara ;
puNikipuccukumdi wasumdhara ; ||
dhara wennela inumikkili inumaDimca -
SaSAmkuDu - kRtajnatalu - namassulu -
jOhArulu, jOtalu - paurNimagaa wistaristu -
wistaaramugaa telipeDi - dRSyaalaku -
wistubOwucunnaaru amdaruu ; ||
&
kRshNa mahalu* = mahal = `building`
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి