27, ఏప్రిల్ 2022, బుధవారం

భవ్య మురళి రాధిక

శ్యామ కృష్ణ తరళ పద్మ కరములందు ; 

భవ్య మురళి రాధిక ; || 

చివురు వ్రేళుల కదలికలతో - 

రమ్య రవళి రాధిక ; ||

స్తబ్ధ ప్రకృతి - మేల్మి పసిడి-

చైతన్య రూపిణి రాధిక ; || 

విబుధ వరుల ; నికష ప్రజ్ఞల ; 

కావ్య రూపిణి రాధిక ; || 

కవుల కలము కజ్జలముల ; 

చిందు కవిత రాధిక ;  || 

గాన, నర్తనాది కళల -

మేలుబంతి రాధిక - ముగ్ధరాణి రాధిక ;

చంద్రజ్యోత్స్న - తిరుణాలల మేళా - మన  రాధిక ; ||

= ` 

Syaama kRshNa taraLa -

padma karamulamdu ; 

bhawya muraLi rAdhika ; || 

ciwuru wrELula kadalikalatO ; 

ramya rawaLi rAdhika ; ||

stabdha prakRti - mElmi pasiDi ; 

caitanya ruupiNi ; 

caitanya ruupiNi rAdhika ; || 

wibudha warula nikasha praj~nala ; 

kaawya ruupiNi rAdhika ; || 

kawula kalamu kajjalamula ; 

cimdu kawita rAdhika ;  || 

gaana, nartanaadi kaLala -

mElubamti rAdhika - 

mugdharaaNi rAdhika ;

camdrajyOtsna - tiruNaalala -

mELaa mana rAdhika ;  ||

;

శుభకృత్ సుమ గీత మాలిక ;- 10  ; song -  10 ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి