రాధ ఏది, ఎక్కడ!? - మేలిముసుగు మాటున,
ఆ మేలిమి ముసుగెక్కడనో!? - తెలిమల్లెల పొదలలోన,
మరి, మల్లెపొదలు ఎక్కడనో? - అందచందాల అల బృందావనిలోన,
బృందావని మునివాకిట, నిలుచున్నది ఎవ్వరనీ? -
రాధికకై ఎదురుచూచు మురళీధర మాధవుడు ;
వేచిచూచు క్రిష్ణయ్యకు రాధ పొలుపు తెలియునా!?
నింగి నుండి తటాలున, భువికి వాలె మెరుపొక్కటి,
విద్యుల్లత తెలిపేను, రాధమ్మ ఆనవాలు ;
రాధ జాడ తెలిపి - మెరుపు ;
శ్రీకృష్ణుని లాస లహరి ఉత్తేజమ్ముల ;
స్వీకరించె బహుమతిగా ;
====================,
raadha Edi, ekkaDa!? -
mElimusugu maaTuna,
aa mElimi musugekkaDanO!? -
telimallela podalalOna,
mari, mallepodalu ekkaDanO? -
amdacamdaala ala bRmdaawanilOna,
bRmdaawani muniwaakiTa, nilucunnadi ewwaranee? -
raadhikakai edurucuucu muraLIdhara maadhawuDu ;
wEcicuucu krishNayyaku raadha polupu teliyunaa!?
nimgi numDi taTAluna, bhuwiki waale merupokkaTi,
widyullata telipEnu, raadhamma aanawaalu ;
raadha jADa telipi - merupu ;
SreekRshNuni laasa lahari uttEjammula ;
sweekarimce bahumatigaa ;
***************************************,
శుభకృత్ సుమ గీత మాలిక ;- 8 ; song - 8 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి