చందనము - లేపనములు - ఎండిపోవుచున్నవి ;
హరి చందనము, లేపనాలు -
పొరలు పొరలు ఔతున్నవి - విడిలి జారిపడుతున్నవి ;
ఎటు దాగెనొ, క్రిష్ణయ్య, - ఎట దాగెనొ, క్రిష్ణయ్య!? ; ||
విరితావులు గాలిలోన - కలిసిపోతు ఉన్నవి ;
పువుల దండ రేకులన్ని - వడలి వత్తలౌతున్నవి ;
ఎటు దాగెనొ, క్రిష్ణయ్య, ఎట దాగెను, క్రిష్ణయ్య,!? ; ||
ఇటు, వక్క పలుకు తాంబూలం - వడలిపోవుచుండగా ; -
ఇటుల, పోకచెక్క, తాంబూలము - వాడిపోవుచుండగా .... ; -
ఎటు దాగెనొ, క్రిష్ణయ్య, ఎట దాగెను, క్రిష్ణయ్య,!? ; ||
యమునాతటి - కెరటాలు - కాళిందీ కల్లోలము - గోచరించుచున్నది ;
ఔరా, మన కన్నయ్య - ఫణి పడగల నెక్కాడు, నాట్య మాడుచున్నాడు ;
అందుకనే, ఈ జాప్యం - తెలిసె మాకు, గోవిందా! నిఖిల లోకరక్షకా!
============================ ,
camdanamu - lEpanamulu - emDipOwucunnawi ;
hari camdana lEpanamulu - poralu poralu autunnawi ;
wiDili jaaripaDutunnawi -
eTu dAgeno, krishNayya!? ; eTa dAgenu, krishNayya!? ; ||
ఎటు దాగెనొ, క్రిష్ణయ్య, ఎట దాగెను, క్రిష్ణయ్య,!? ; ||
wiritaawulu gaalilOna - kalisipOtu unnawi ;
puwula damDa rEkulanni - waDali wattalautunnawi ;
eTu dAgeno, krishNayya!? ; eTa dAgenu, krishNayya!? ; ||
iTu, wakka paluku taambuulam - waDalipOwucumDagA ; -
iTula, pOkacekka, taambuulamu - waaDipOwucumDagA .... ; -
eTu dAgeno, krishNayya!? ; eTa dAgenu, krishNayya!? ; ||
yamunaataTi - keraTAlu - kaaLimdee kallOlamu -
gOcarimcucunnadi - auraa, mana kannayya -
phaNi paDagala nekkADu - nATya mADucunnADu ;
amdukanE, ee jaapyam -
telisenu maaku gOwimdaa! - nikhila lOkarakshakA!
;
శుభకృత్ సుమ గీత మాలిక - 1 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి