28, ఏప్రిల్ 2022, గురువారం

గరుడ, నంది వర్ధనాలు

పరిమళాల పూలమూట - వనితామణి - 

రాధ తేట నగవుల ఊట ; ||

గోవర్ధన గిరి పైన నందివర్ధనం - 

పూలు పూసె నిండుగాను - 

మన కన్నుల తారలొహో - మన మనసులు అంబరమే ; ; 

వర్ధనాలు, వర్ధనాలు - గరుడ, నంది వర్ధనాలు - ;

కృష్ణయ్యా, రావోయీ -  - ఇట - 

నీకోసమె - విరబూసెను గరుడవర్ధనాలు  ;

అట, నీకొరకు  వేచినది - బేల రాధిక ; 

వేయి కనులతో నీకై - వేచి చూస్తు ఉన్నాది ; || 

కొంగు నిండ నింపి ఉంచె -  

తన ఓణీ - కొంగు నిండ నింపి ఉంచె - నందివర్ధనాలు  ;

వర్ధనాలు, వర్ధనాలు - నందివర్ధనాలు ;

వర్ధనాలు, వర్ధనాలు - గరుడవర్ధనాలు ; || 

========================== ,

parimaLAla puulamUTa - wanitaamaNi - 

raadha tETa nagawula UTa ; ||

gOwardhana giri paina namdiwardhanam - 

puulu puuse nimDugaanu - 

mana kannula taaralohO - mana manasulu ambaramE ; ; 

wardhanaalu, wardhanaalu - garuDa, namdi wardhanaalu - ;

kRshNayyaa, raawOyI -  - iTa - 

neekOsame - wirabuusenu garuDawardhanaalu  ;

aTa, neekoraku  wEcinadi - bEla raadhika ; 

wEyi kanulatO neekai - wEci cuustu unnaadi ; || 

komgu nimDa nimpi umce -  

tana ONI - komgu nimDa nimpi umce - namdiwardhanaalu  ;

wardhanaalu, wardhanaalu - namdiwardhanaalu ;

wardhanaalu, wardhanaalu - garuDawardhanaalu ; ||

&  

వర్ధనాలు, వర్ధనాలు - గరుడ, నంది వర్ధనాలు ;;

శుభకృత్ సుమ గీత మాలిక ;- 17  ; song - 17 ;;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి