జనని నిన్ను లాలించి - తనివితీర బుజ్జగిస్తు ;
జో జో జోల - జోల పాడేనిదె క్రిష్ణ!
లాలిపాట లాలనల ;
వనరుగ ఒదిగి ఉండు అమ్మ తీపి ప్రేమ ; ||
;
జోలపాట లన్నిటిని - గుది గుచ్చిన తారలతో ;
హలహలల కళకళల ;
నింగి అంత మిలమిలల - హేలాపురి ఆయేను ; ||
ఉళ్ళుళ్ళ హాయి హాయి ;
ఉఌౡ హాయి - లాలి పాటలందు చేరు ;
కమ్మ కమ్మని శృతి లయల - తీపి తాయిలములు ; ||
;
బాలక్రిష్ణ కేరింతలు - జగమెల్ల అలుముకున్న ;
వెన్న వెన్నెలమ్మలు - తడుముకోకుండ ;
తడవ తడవకు ;
విశ్వమ్ముకు మేళవింపు - నిండు పున్నమి ఆలాపనలు ; ||
;
==========================, , ;
janani ninnu laalimci ; taniwiteera bujjagistu ;
jO jO jOla - jOla paaDEnide krishNa!
laalipATa laalanala ;
wanaruga odigi umDu amma teepi prEma ; ||
;
jOlapATa lanniTini - gudi guccina taaralatO ;
hala halala kaLakaLala ;
nimgi amta milamilala - hElaapuri aayEnu ; ||
;
uLLuLLa haayi haayi - laali pATalamdu cEru ;
kamma kammani SRti layala - teepi taayilamulu ; ||
;
baalakrishNa kErimtalu - jagamella alumukunna ;
wenna wennelammalu - taDumukOkumDa ;
taDawa taDawaku ;
wiSwammuku mELawimpu - nimDu punnami Alaapanalu ; ||
&
ఉఌౡ హాయి - లాలి పాట ఉఌౡ హాయి - లాలి పాట ;
శుభకృత్ సుమ గీత మాలిక ;- 15 ; song - 15 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి